ఇండస్ట్రీలో కొందరికి ఎన్ని సినిమాలు చేసినా రానీ గుర్తింపు.. మరికొందరికి మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బ్యూటీ లైఫ్ కూడా అలాంటిది. ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డుల తిరగరాసింది.
ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్లతో చూస్తుండగానే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. కట్ చేస్తే, కెరీర్ కాస్త స్లో అయ్యాక బిలియనీర్‌ను పెళ్లి చేసుకుని ఏకంగా రూ.10వేల కోట్లకు యువరాణి అయ్యింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా? ఆమె మరెవరో కాదు ఆసిన్.
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆసిన్. డెబ్యూ సినిమాతోనే రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత శివమణి, లక్ష్మీ నరసింహా, ఘర్షణ ఇలా వరుస హిట్లతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
ఆ తర్వాత సూర్యతో చేసిన గజినీ సినిమా మాత్రం ఆసిన్‌కు తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. అసలు ఈ సినిమాలో కల్పనగా టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించింది. చివరగా అన్నవరం సినిమాలో నటించింది.
అలా రాహుల్ శర్మను పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది ఆసిన్. ప్రస్తుతం తను తన భర్త, పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. తెలుగు కుర్రాళ్లను మాయలో పడేసిన మలయాళి ముద్దుగుమ్మల్లో ఆసిన్ కూడా ఒకరు. సినిమాలు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది.