లక్నో/పట్నా:
Pawan Singh controversy | బోజ్‌పురి స్టార్ పవన్ సింగ్‌పై లక్నోలో జరిగిన ఒక స్టేజ్ ఈవెంట్‌లో వివాదం రేగింది. సహనటి అంజలి రాఘవను పబ్లిక్ స్టేజ్‌పై అసౌకర్యానికి గురిచేసినట్టు వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సంఘటనతో షాక్ అయిన అంజలి రాఘవ, బోజ్‌పురి పరిశ్రమను వదిలేస్తున్నానని ప్రకటించింది.
స్టేజ్‌పై పాట ప్రదర్శన జరుగుతుండగా పవన్ సింగ్, అంజలి నడుముపై పలుమార్లు చేతులు వేసారు. “ఏదో ఇరుక్కుపోయింది, దాన్ని తీసేయాలి” అనే కారణం చెబుతూ ఆయన ఇలా చేసినట్టు వీడియోలో కనిపించింది. కానీ అంజలి ముఖంలో స్పష్టమైన అసౌకర్యం కనిపించింది.
తాజాగా ఈ వివాదంపై పవన్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో క్షమాపణ చెప్పారు.
ఆయన రాసిన నోట్‌లో:
“అంజలి జీ, బిజీ షెడ్యూల్ వల్ల మీ లైవ్ చూడలేకపోయాను. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే నాకు బాధ కలిగింది.
మీ పట్ల నాకు ఎటువంటి తప్పు ఉద్దేశ్యం లేదు. అయినప్పటికీ నా ప్రవర్తన వల్ల మీకు అసౌకర్యం కలిగితే క్షమాపణ కోరుతున్నాను.”
అంజలి రాఘవ మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు వీడియోలు షేర్ చేశారు.
“రెండు రోజులుగా చాలా బాధగా ఉంది. నాకు ఎందుకు రియాక్ట్ కాలేదని, ఎందుకు చెంపదెబ్బ కొట్టలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొందరు నన్నే తప్పు పడుతున్నారు. ‘అది నవ్వింది కదా, మజా చేసింది కదా’ అని మీమ్స్ చేస్తున్నారు. ఇలా టచ్ చేస్తే నాకు సంతోషమా?” అని ప్రశ్నించారు.
మరో వీడియోలో :
“నేను ఇకపై బోజ్‌పురి పరిశ్రమలో పని చేయను. ఆర్టిస్ట్‌గా కొత్త విషయాలు చేయాలనిపిస్తుంది కానీ నా కుటుంబంతో, నా హర్యానాలోనే సంతోషంగా ఉంటాను.”
దీంతో పవన్ సింగ్ ఇమేజ్‌కు మాత్రం పెద్ద దెబ్బ తగిలింది.
అభిమానుల్లో విభేదాలు – కొందరు క్షమాపణను అంగీకరించగా, మరికొందరు అది ఆలస్యమని అంటున్నారు.
ఈ సంఘటన బోజ్‌పురి పరిశ్రమలో మహిళా కళాకారుల భద్రత, గౌరవం పై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
ఈ సంఘటనతో పవన్ సింగ్ భవిష్యత్ కెరీర్‌పై మబ్బులు కమ్ముకున్నాయి. అదే సమయంలో అంజలి రాఘవ కొత్త దిశలో ముందుకు వెళ్ళాలని స్పష్టమైన సందేశం ఇచ్చింది.