Site icon vidhaatha

1000 Rupee Coin| మన రూ.1000 నాణేం చూశారా !

విధాత, హైదరాబాద్ : భారత(India) ప్రభుత్వం రూ.1000 నాణేం(1000 Rupee Coin) విడుదల చేసినప్పటికి..అది పెద్దగా జనబాహుళ్యంలోకి రాలేదు. దీంతో ఆ నాణేం ఎలా ఉంటుందన్న ప్రజల్లో నెలకొంది. ఏపీ(ap)కి చెందిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం భూపయ్య అగ్రహారం వాసి పుత్సా కామేశ్వరరావు ప్రత్యేక శ్రద్దతో ఈ నాణేన్ని సేకరించడం అది కాస్తా వైరల్ గా మారింది. ముంబైలోని టంకశాల నుంచి ఆయన ఈ నాణేన్ని రూ.8137కు కోనుగోలు చేశానని చెబుతూ నాణేం వివరాలను వెల్లడించారు.

రూ.1000నాణేం 40 గ్రాముల పూర్తి వెండి(Silver Coin)తో తయారైంది. 44 మిల్లిమీటర్ల వ్యాసం ఉంది. నాణేం ముందువైపు భారత ప్రభుత్వం రాజముద్ర అశోకుడి సింహ మూర్తి, దాని కింద జాతీయ నినాదం “సత్యమేవ జయతే” అని రాసి ఉంది. ఎడమ అంచున దేవనాగరి లిపిలో ‘భారత్’ అనే పదం, కుడివైపున ‘ఇండియా’ అనే పదం ఆంగ్లంలో కనిపిస్తుంది. అశోక ముద్ర క్రింద, రూపాయి చిహ్నం, రూ.1000ముఖ విలువ అంతర్జాతీయ సంఖ్యలో ముద్రించారు.

వెనుక వైపున చోళ రాజవంశీయులలో గొప్ప చక్రవర్తి గంగైకొండ రాజేంద్రచోళుడు(Rajendra Chola) గుర్రంపై కత్తి పట్టుకుని ఉన్న చిత్రంతో పాటు తంజావురు బృహదీశ్వరాలయం(Brihadeeswarar Temple) చోళులు ప్రయాణించిన నౌకలను ముద్రించారు. ఇంగ్లీష్ , దేవనాగరి లిపిలలొ “చక్రవర్తి రాజేంద్ర చోళుని 1000 సంవత్సరాల నావికా యాత్ర – I” అని కూడా రాసి ఉంది. చోళ చక్రవర్తి రాజేంద్రచోళుడు క్రీ.శ 1014 నుంచి 1044 వరకు పాలించారు. గంగైకొండ చోళపురంలో రాజేంద్ర చోళుడు చారిత్రక నావికా దండయాత్ర చేపట్టి 1,000వ వార్షికోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఈ నాణెం విడుదల చేసినట్లు కామేశ్వరరావు తెలిపారు. చోళ రాజుల వారసత్వం..బృహదీశ్వర ఆలయం వెయ్యేళ్ల వార్షికోత్సవాన్ని స్మరించుకుంటూ చారిత్రాత్మక గంగైకొండ చోళపురం పర్యటన సందర్భంగా ఈ ఏడాది జూలై 27న ప్రధాని మోదీ ఈ నాణేన్ని ఆవిష్కరించారు.

 

 

Exit mobile version