విధాత : పశ్చిమాసియా యుద్ధం అంశంపై చర్చకు విపక్షాల చేసిన డిమాండ్ ను కేంద్రం పట్టించుకోకపోవడం రచ్చకు దారితీసింది. యుద్దంపై చర్చ లేకుండానే కేంద్ర మంత్రి జైశంకర్ పశ్చిమాసియా యుద్దం అంశంపై ప్రకటన చేశారు. కేంద్రం వైఖరిపై విపక్షాల అభ్యంతరం చెప్పిన క్రమంలో లోక్‌సభలో కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది.
అటు రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసనల మధ్యనే జై శంకర్ కీలక ప్రకటన చేశారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నట్లు రాజ్యసభలో వెల్లడించారు. ప్రధాని మోదీ యుద్ధ పరిస్థితులపై నిరంతరం చర్చలు జరుపుతున్నారని, భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. పెట్రోల్, గ్యాస్ ధరలపై సైతం దృష్టి సారించినట్లుగా, వాటి ధరలు పెంచబోమంటూ కీలక హామీ ఇచ్చారు.
అనంతరం పార్లమెంటులో పశ్చిమాసియ యుద్దం అంశంపై చర్చను అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసనకు దిగాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
Indian Rupee : యుద్దం ఎఫెక్ట్..భారీగా పడిపోయిన రూపాయి విలువ !
99 Day Prajapalana | 99 రోజుల ప్రణాళిక బాగానే ఉంది.. కానీ.. అమలు పైనే అసలు ఫలితం
