Indian Rupee : యుద్దం ఎఫెక్ట్..భారీగా పడిపోయిన రూపాయి విలువ !

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో రూపాయి భారీగా బలహీనపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92.33కి పడిపోయింది. పెరిగిన ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి.

Indian Rupee

విధాత : పశ్చిమాసియా యుద్ద పరిస్థితులతో మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య పరిణామాలు భారతీయ కరెన్సీ రూపాయికి ప్రతికూలంగా మారాయి. సోమవారం ట్రేడింగ్‌లో భారత రూపాయి అమెరికా డాలర్‌తో పోలిస్తే 92.33కి పడిపోయి భారీ పతనాన్ని నమోదు చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరిగిపోతున్న ముడి చమురు ధరలతో రూపాయి విలువను బలహీనపరిచాయి. రూపాయి పతనాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ డాలర్లను విక్రయించే చర్యలు చేపట్టినప్పటికి రూపాయి రేటు .. రిస్క్-ఆఫ్ ప్రవాహాల కారణంగా మళ్ళీ బలహీనపడింది. రూపాయి 92.33 కనిష్ట స్థాయి అనేక రంగాలపై ప్రభావం చూపనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

శుక్రవారం రూపాయి 91.74 వద్ద ముగిసింది. సోమవారం నాటికి, ఇది 0.50%, లేదా 59 పైసలు తగ్గి 92.33కి చేరుకుంది. అదే సమయంలో ముడి చమురు 117 డాలర్లకు పెరిగింది. భారతదేశం ఎక్కువగా దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడి ఉండటం, ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసాలు అంతర్జాతీయంగా కొనసాగుతున్న వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుండటంతో రూపాయి బలహీనపడిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. చమురు ధరల విలువ యుద్ద పరిణామాల మధ్య 50% కంటే ఎక్కువ పెరిగాయని, చమురు ధరలు పెరగడం వల్ల భారతదేశ దిగుమతి బిల్లు సాధారణంగా పెరుగుతుందని పేర్కొన్నారు . చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి ఖర్చులు,ఇంధన ధరలు పెరుగుతాయని, ఇది రవాణా, ఆహారం, ఉత్పత్తి వ్యయాలను పెంచడంతో పాటు ద్రవ్యోల్బణ ప్రమాదాలను పెంచుతుంది అని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Gold Silver Price Today | తగ్గిన బంగారం .. స్థిరంగా వెండి ధరలు
ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్..కవిత సహా నిందితులకు హైకోర్టు నోటీసులు !

Latest News