ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్..కవిత సహా నిందితులకు హైకోర్టు నోటీసులు !
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సీబీఐ సవాల్ చేయడంతో కవిత, కేజ్రీవాల్, సిసోడియా సహా 23మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసు మరో కీలక మలుపు తీసుకుంది. ఇటీవల ఈ కేసులో నిందితులు అందిరికి రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చీట్ ఇస్తూ..కేసు కొట్టివేసి వారి విడుదలకు ఆదేశాలిస్తూ తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. సీబీఐ పిటీషన్ ను విచారించిన హైకోర్టు నిందితులు కల్వకుంట్ల కవిత, మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సిసోడియా సహా 23మంది నిందితులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐపై ట్రయల్ కోర్టు స్పెషల్ జడ్జీ జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది. సీబీఐ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. అనంతరం 2026, మార్చి 16కు విచారణను వాయిదా వేసింది.
సీబీఐ పిటిషన్ కు మద్దతుగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. దర్యాప్తు సంస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ట్రయల్ తీర్పు ఉందని సీబీఐ తరఫున కేజ్రీవాల్, సిసోడియా, కవిత పాత్రను అంచనా వేయడంలో స్పెషల్ కోర్టు పొరబడిందని తెలిపారు. మద్యం పాలసీ వెనుక ఉన్న భారీ కుట్రను పరిగణలోకి తీసుకోకుండా..కేసును విడివిడి అంశాలుగా పరిగణించడం వల్ల కేసు నీరుగారిందని ఆరోపించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ట్రయల్ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు.. సీబీఐపై ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై స్టే విధించింది.
ఈ పిటిషన్‌పై విచారణ ముగిసే వరకు ఈడీ కేసులో విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అలాగే.. కేజ్రీవాల్, కవిత సహా 23 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి :
99 Day Prajapalana | 99 రోజుల ప్రణాళిక బాగానే ఉంది.. కానీ.. అమలు పైనే అసలు ఫలితం
Chai Guy | లేఆఫ్‌లో ఉద్యోగం పోతే.. అమెరికాలో ఛాయ్ అమ్ముతూ సక్సెస్ అయ్యాడు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram