Gold Silver Price Today | తగ్గిన బంగారం .. స్థిరంగా వెండి ధరలు

బంగారం ధరలు మరోసారి తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి రూ.1,960 తగ్గి రూ.1,61,680కు చేరగా, వెండి ధర కిలో రూ.2,90,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Reported by: Tejaswini Nanna | వాణిజ్యం | Mar 09, 2026, 2:18 pm IST
Read Time: 3 mins
Gold Silver Price Today | తగ్గిన బంగారం .. స్థిరంగా వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిణామాల క్రమంలో నిరంతరం హెచ్చు తగ్గులకు లోనవుతున్న
బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. సోమవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,61,680వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,800తగ్గి రూ.1,48,200వద్ద కొనసాగుతుంది.

బంగారం ధరలతో పోల్చితే వెండి ధరలు మాత్రం వరుసగా నాల్గవ రోజు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం కిలో వెండి ధర రూ. 2,90,000 వద్ద కొనసాగుతుంది.

ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు బులియన్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులకు కారణం అవుతున్నాయి. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు డాలర్ విలువపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. దీంతో పసిడి ధరలపై దాని ప్రభావం పడుతోంది. తగ్గిన బంగారం ధరలు ప్రస్తుతం భారత్ లో శుభ మూహుర్తాల నేపథ్యంలో కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినా..రానున్న రోజుల్లో ఇలాగే ఉంటాయన్న గ్యారంటీ లేదు. భవిష్యత్తులో విలువైన లోహాలు బంగారం, వెండి ధరలు పెరుగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Rajya Sabha Elections : రాజ్యసభకు సింఘ్వీ..వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవం
Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న పెళ్లి ఖర్చుపై ఆసక్తికర వివరాలు.. ఆసియాలోనే బిగ్గెస్ట్ వెడ్డింగ్ అంటూ ఆడిటర్ కామెంట్స్