• Telugu News
  • /Telangana

Rajya Sabha Elections : రాజ్యసభకు సింఘ్వీ..వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవం

తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇతర నామినేషన్లు లేకపోవడంతో వారి ఎన్నికను సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Mar 09, 2026, 1:55 pm IST
Read Time: 2 mins
Rajya Sabha Elections : రాజ్యసభకు సింఘ్వీ..వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా ముగియ్యనుంది. ఎన్నికపై సాయంత్రం అధికారికంగా ప్రకటన వెలువడనుంది. అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిల నామినేషన్లు మాత్రమే మిగిలి ఉండటంతో వారి ఏకగ్రీవ ఎన్నిక లాంఛనం కానుంది. సాయంత్రం ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డిక, స్టేట్ చీఫ్ ఏలెక్షన్ కమిషనర్ వారి ఎన్నికను ధృవీకరించనున్నారు.

తగినంత ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేకపోవడంతో ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలు పోటీకి దూరంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాలకు సోమవారం మధ్యాహ్నం 3గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియ్యనుంది. ఏకగ్రీవం కాని స్థానాలకు మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి :

99 Day Prajapalana | 99 రోజుల ప్రణాళిక బాగానే ఉంది.. కానీ.. అమలు పైనే అసలు ఫలితం
Warangal : క్రికెట్‌ విజయోత్సవంలో ‘మత’ విద్వేషం.. ఓ మతం జెండా పెట్టిన కొందరు.. అడ్డుకున్న మరో వర్గం