విధాత, హైదరాబాద్ : హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేశారు. పూర్ణిపూర్ణనంద పోటీ చేయనుండటం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి షాక్‌గా మారింది. పరిపూర్ణానంద ముందు నుంచే హిందూపురం లోక్‌సభ లేదా అసెంబ్లీ స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. ఇందుకు ఆయన కొంతకాలంగా సన్నద్ధమవుతు ప్రజలతో మమేకమవుతు వచ్చారు. హిందూపురం లోకసభ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం పరిపూర్ణానందను తొలుత ఖరారు చేసినప్పటికీ మైనారిటీ ఓట్లు బీజేపీకి పడవనే అనుమానంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ స్థానాన్ని టీడీపీకి వదిలేసింది. ఈ సందర్భంగా పొత్తుల కారణంగానే తనకు టికెట్ రాకుండా చేశారంటూ పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా వీకే. పార్థసారధి పోటీ చేస్తుండగా, అసెంబ్లీ స్థానానికి సిటింగ్ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పరిపూర్ణనంద అసెంబ్లీ బరిలో నామినేషన్ వేయడంతో కూటమి ఓట్లు చీలుతాయనే భయం టీడీపీని వెంటాడుతోంది. నామినేషన్ ఉపసంహరణ నాటికి ఆయనను బుజ్జగిస్తారో లేదో వేచిచూడాల్సివుంది. ఇక్కడ వైసీపీ నుంచి టీఎన్. దీపిక పోటీలో ఉన్నారు.
కూటమికి బిగ్ షాక్..హిందూపురంలో స్వామి పరిపూర్ణానంద నామినేషన్
హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేశారు. పూర్ణిపూర్ణనంద పోటీ చేయనుండటం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి షాక్‌గా మారింది

Latest News
25 ఏళ్ల సర్వీసు… 21 సార్లు బదిలీలు.. ఫుడ్ మాఫియాకు చుక్కలు చూపిస్తున్న ఐఏఎస్ తుకారాం ముండే
ఎల్‌నినోపై తెలంగాణ సర్కార్ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక విడుదల
లోక్‌సభలో ఏడు కీలక బిల్లులకు సిద్ధమైన కేంద్రం
భారత్ లో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు!
తెలంగాణలో ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం
ఘాఘరా నదిలో మొసలి దాడి.. 12 ఏళ్ల బాలుడు మృతి!
పసికందు వద్దకు పాము..నెమలికి ఆహారం..వైరల్
ఈవిడ ఆవిడేనా…నటి నమిత వీడియో వైరల్
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ