Site icon vidhaatha

పోలవరం పరిధిలోని ప్రాజెక్టులకు 120 కోట్లు జరిమానా

విధాత: పోలవరం పరిధిలో… కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టిన వివిధ ప్రాజెక్ట్ లకు NGT ఫైన్ విధించింది.
పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టినందుకు పోలవరం ప్రాజెక్టు పరిధిలోని వివిధ ప్రాజెక్టులపై రూ.120 కోట్లు జరిమానా విధిస్తున్నట్లు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యూనల్‌ (ఎన్‌జీటీ) ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న పురుషోత్తపట్నంకు రూ. 24.56 కోట్లు, పట్టిసీమకు రూ. 24.90 కోట్లుచింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ. 73.6 కోట్ల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లో చెల్లించాలని ఏపీ ప్రభుత్వానికి ఎన్‌జీటీ ఆదేశించింది.

Exit mobile version