విధాత: తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ 18వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నారు. 2016 నుంచి 2019 వరకూ వివిధ కోర్సులు పూర్తి చేసిన వారికి స్నాతకోత్సవ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పద్మావతి వర్సిటీ ఛాన్స్‌లర్ హోదాలో హాజరు కానున్నారు. ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారితో పాటు పుస్తక, నగదు, బంగారు పతకాలకు ఎంపికైన వారు స్నాతకోత్సవానికి తప్పక హాజరు కావాలని పద్మావతి వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డీఎం మమత కోరారు.