Site icon vidhaatha

భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న cbi మాజీ jd లక్ష్మీనారాయణ

విధాత:తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామం రాచపల్లి వద్ద 12 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ప్రయోగాలు చేపడతామన్నారు.cbi మాజీ జె డి లక్ష్మీనారాయణ.ఏరువాక పున్నమి రోజు దుక్కి దున్ని వ్యవసాయాన్ని ప్రారంభించిన సిబిఐ మాజీ జె డి లక్ష్మీనారాయణ. వరి నాట్లు వేసి వ్యవసాయ పనులు చేపట్టారు.జెడి లక్ష్మీనారాయణ తోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రైతులు, రైతు ప్రతినిధులు,వ్యవసాయ నిపుణులు.తాను ఏ పార్టీలో లేనని రైతుల పార్టీలో ఉన్నానని చెప్పిన సీబీఐ మాజీ జె.డి లక్ష్మీనారాయణ.భవిష్యత్తులో ధర్మవరం గ్రామాన్ని వ్యవసాయ ప్రయోగాత్మక కేంద్రంగా మారుస్తామని ప్రకటించిన లక్ష్మీనారాయణ.

Exit mobile version