Site icon vidhaatha

చౌడవాడలో యువతిపై పెట్రోలుతో దాడి ఘటన పై జ‌గ‌న్ ఆరా..

విధాత‌: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడ గ్రామంలో యువతి రాములమ్మపై పెట్రోలుపోసి నిప్పుపెట్టిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులుు సీఎంకు తెలియజేశారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగిందని, బాధితులు ఫోన్‌ద్వారా ఫిర్యాదు చేయగానే వెంటనే పోలీసులు స్పందించి ఆమెను సమీప ఆస్పత్రిలో చేర్చారని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలమేరకు రాములమ్మకు విశాఖపట్నం తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం బాధితురాలు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలబడాలని, అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించాలని మంత్రి బొత్స సత్యన్నారాయణను సీఎం ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి బొత్స సహా డిప్యూటీ సీఎం పుష్ఫశ్రీవాణి, అధికారులు బాధితురాలిని పరామర్శించారు.

Exit mobile version