Site icon vidhaatha

పోలవరం పనుల పురోగతిపై సీఎం జగన్ స‌మీక్ష‌

2022 జూన్‌ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలి..

విధాత:పోలవరం పనుల పురోగతిపై అధికారులతో సీఎం జగన్ జరిపిన సమీక్షలో స్పిల్‌వే 42 గేట్లు అమర్చినట్టు తెలిపిన అధికారులు.. ఎగువ కాఫర్‌ డ్యాం పనులను పూర్తి చేశామని తెలిపారు. అదే సమయంలో దిగువ కాఫర్ డ్యాం పనుల పరిస్థితిని అధికారులు వివరించగా, 2022 జూన్‌ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలని, టన్నెల్, లైనింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్‌ సూచించారు. 2023 ఖరీఫ్‌ సీజన్‌కల్లా ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం పూర్తి చేయాలని అధికారులతో సమీక్షలో సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ఉపముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్‌, రవాణాశాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, పోలవరం నిర్మాణసంస్ధ ప్రతినిధులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు.

Exit mobile version