Pawan Kalyan | పవన్ మీద వలంటీర్లు పరువునష్టం కేసు

Pawan Kalyan విధాత‌: అనుకున్నదే జరిగింది. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారు.. ప్రజల వ్యక్తిగత సమాచార సేకరిస్తున్నారు.. వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అంటూ పవన్ ఈమధ్య చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపడమే కాదు..ఇప్పుడు ఆయన్ను కోర్టుకు లాగాయి. ప‌వ‌న్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వాలంటీర్ల ప‌రువుకు న‌ష్టం క‌లిగింద‌ని, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని పేర్కొంటూ ఓ మ‌హిళా వాలంటీర్ వేసిన పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది. పవన్‌ కల్యాణ్‌ ఆమధ్య ఏలూరులో జరిగిన […]

  • Publish Date - July 24, 2023 / 02:10 PM IST

Pawan Kalyan

విధాత‌: అనుకున్నదే జరిగింది. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారు.. ప్రజల వ్యక్తిగత సమాచార సేకరిస్తున్నారు.. వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అంటూ పవన్ ఈమధ్య చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని లేపడమే కాదు..ఇప్పుడు ఆయన్ను కోర్టుకు లాగాయి. ప‌వ‌న్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వాలంటీర్ల ప‌రువుకు న‌ష్టం క‌లిగింద‌ని, తమ మనోభావాలు దెబ్బ తిన్నాయని పేర్కొంటూ ఓ మ‌హిళా వాలంటీర్ వేసిన పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది. పవన్‌ కల్యాణ్‌ ఆమధ్య ఏలూరులో జరిగిన సభలో… వాలంటీర్లపై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ మహిళా వాలంటీర్‌ విజయవాడ సివిల్‌ కోర్టులో పవన్‌ పై పరువునష్టం కేసు వేశారు.

ఈ పిటిష‌న్‌ ను కోర్టు స్వీక‌రించిన‌ట్టు తెలిసింది . ఈ కేసుపై మహిళా వాలంటీర్‌ తరఫున న్యాయవాదులు సెక్షన్ 499, 500, 504, 505 ప్రకారం కేసు దాఖలు చేశారు. పవన్‌ వ్యాఖ్యలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. బాధితురాలి స్టేట్‌ మెంట్‌ ను రికార్డు చేసిన త‌ర్వాతే ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ కు కోర్టు నోటీసులు పంపుతుంది అని ఆమె తరఫు లాయర్లు చెబుతున్నారు. నోటీసులు అందుకున్న అనంతరం ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. పవన్ ఆరోపిస్తున్నట్టుగా మహిళల అక్రమ రవాణాకు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్‌ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలు కోర్టుకు వెల్లడించాలని అన్నారు.

వాలంటీర్లలో 60 శాతం మంది మ‌హిళ‌లే ఉన్నార‌ని వారు చెప్పుకొచ్చారు. ప‌వ‌న్‌ పై చ‌ర్యలు తీసుకోవాల‌ని న్యాయ‌మూర్తిని కోరిన‌ట్టు వాలంటీర్ త‌ర‌పు న్యాయ‌వాదులు వెల్లడించారు. మ‌హిళ‌ల అక్రమ ర‌వాణాకు పాల్పడుతున్నట్టుగా త‌మ‌పై ప‌వ‌న్ అనుచిత వ్యాఖ్యలు చేశార‌ని.. అవి త‌మ‌ను మాన‌సికంగా కుంగదీశాయని… పవన్ వ్యాఖ్యల తర్వాత తనను చుట్టుపక్కల వారు ప్రశ్నించారని.. నిస్వార్ధంగా సేవ చేస్తున్న మాపై నిందలు వేశారని ఆమె తెలిపారు. అనంతరం పవన్‌ ను చట్టపరంగా శిక్షించాలి అని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు ఈ పిటిషన్ కు పవన్ కోర్టుకు ఎలా సమాధానం చెబుతారో చూడాలి. ఆయన ఆరోపించినట్లుగా కేంద్ర నిఘా వర్గాల సమాచారం గానీ కోర్టుకు సమర్పిస్తారా ? చూడాలి

Latest News