వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాకు ఫిర్యాదు

విధాత:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేసే ఎంపీ రఘురామ కృష్ణంరాజు… తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఆవరణలో తనను వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామకృష్ణరాజు. ఇక అంతకు ముందు పార్లమెంట్ […]

  • Publish Date - August 3, 2021 / 12:53 PM IST

విధాత:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేసే ఎంపీ రఘురామ కృష్ణంరాజు… తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లాకు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఆవరణలో తనను వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామకృష్ణరాజు.

ఇక అంతకు ముందు పార్లమెంట్ ఆవరణలో రఘురామకృష్ణం రాజు పై ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ లు ఆపకపోతే అంతం చేస్తామని రఘురామను గోరంట్ల మాధవ్ బెదిరించారు. అయితే దీనిపై స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు… మాధవ్ పై చర్యలు తీసుకోవాలని లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

Latest News