AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఏంటంటే?
ఏపీలో రూ. 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గురువారం ఏపీ కేబినెట్ సమావేశం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది

AP Cabinet
విధాత: ఏపీలో రూ. 80 వేల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గురువారం ఏపీ కేబినెట్ సమావేశం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 42 అంశాలపై చర్చించారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ మంత్రి మండలి ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టే ఎలక్ట్రానిక్ భాగాల తయారీ కంపెనీలు ముందస్తు ప్రోత్సాహకాలుపొందవచ్చవని ఆయన తెలిపారు.. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీ, కర్నూలు సమీపంలోని ఓర్వకల్, కొప్పర్తి హిందూపూర్ వంటి ప్రాంతాల్లో గణనీయంగా ఉద్యోగ కల్పనకు అవకాశం ఏర్పడ నుందని ఆయన వివరించారు.రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిపార్సు మేరకు విశాఖపట్నం జిల్లా మధురవాడలో 3.6 ఎకరాల భూమిని ఎకరం రూ.1 కోటి చొప్పున పరదేసీపాలెం వద్ద 50 ఎకరాలను రూ.50 లక్షల చొప్పున సిఫీ కంపెనీకి భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ భూ కేటాయింపుల ద్వారా రూ. 16,466 కోట్ల పెట్టుబడులు వస్తాయని, తద్వారా 600 ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు.LRS-2020లోని సవరణలను చేసేందుకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖచేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు.విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేస్-I క్రింద రెండు కారిడార్లతో అనుమతి మంజూరు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి చెప్పారు.