Chandrababu | న‌వ్యాంధ్ర ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ‌స్వీకారం

Chandrababu | న‌వ్యాంధ్ర‌ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. చంద్ర‌బాబు చేత ఏపీ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌మాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణం చేశారు.

  • Publish Date - June 12, 2024 / 11:35 AM IST

Chandrababu | అమ‌రావ‌తి : న‌వ్యాంధ్ర‌ ముఖ్య‌మంత్రిగా నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. చంద్ర‌బాబు చేత ఏపీ గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ ప్ర‌మాణం చేయించారు. డిప్యూటీ సీఎంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణం చేశారు. ఇక 23 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. చంద్ర‌బాబు ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న స‌మ‌యంలో స‌భా ప్రాంగ‌ణ‌మంతా సీబీఎన్.. సీబీఎన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కృష్ణా జిల్లాలోని కేస‌ర‌ప‌ల్లిలో ఏర్పాటు చేసిన స‌భా ప్రాంగ‌ణ‌మంతా ఏపీ ప్ర‌జ‌ల‌తో కిక్కిరిసిపోయింది.

ఈ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు, మాజీ సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గ‌డ్క‌రీ, జేపీ న‌డ్డా, కిష‌న్ రెడ్డి, రామ్మోహ‌న్ నాయుడు, పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, సినీ న‌టులు చిరంజీవి, ర‌జ‌నీకాంత్, రామ్ చ‌ర‌ణ్‌, నిఖిల్, నారా రోహిత్, ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి అన్నా లెజినోవా, ద‌ర్శ‌కుడు క్రిష్, ఎమ్మార్పీఎస్ అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

Latest News