Site icon vidhaatha

పెట్రోల్ డీజల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా – సంతకాల సేకరణ.

విధాత :పెట్రోల్,గ్యాస్ ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయి.కరోనా కష్టకాలంలో ప్రజలను దోపిడీ చేస్తున్నారు.14 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు పెట్రోల్ పేరిట దోచుకున్నారు.దీనిపై సీఎం జగన్ ఎందుకు మాట్లాడరు. ఒక్క స్టేట్ టాక్స్ 40 రూపాయలు ఉంది, కేంద్రం 30 రూపాయలు టాక్స్ వేస్తోంది.నేపాల్, శ్రీలంక లో తక్కువ ధరలు ఉన్నాయి, మన రాష్ట్రంలో ఎందుకు ఎక్కువ ?
మీ ఆర్థిక మిత్రులకు దోచి పెట్టడానికి ప్రజలపై భారం వేస్తున్నారు.పెట్రోల్ ధరలు పెరిగితే అన్ని ధరలు పెరిగిపోతాయి. దీనిపై 17 తేదీ వరకూ ర్యాలీ లు కొనసాగుతాయి,17 న కర్నూలు లో రాష్ట్ర స్థాయి సభ ఏర్పాటు చేస్తాం.అడిగిన మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు.పెట్రోల్ ,గ్యాస్ ధరలు తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

-సాకే శైలజానాథ్

Exit mobile version