Diwali for AP Farmers | అక్టోబర్‌లోనే ఏపీ రైతుల ఖాతాల్లో ‘అన్నదాత సుఖీభవ’ – ‘పీఎం కిసాన్’ నిధులు

ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళికి ముందే రానుంది. అక్టోబర్ 18న అన్నదాత సుఖీభవతో పాటు పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

Annadata Sukhibhava & PM Kisan Funds to be Credited in AP Farmers’ Accounts by October

అమరావతి:

Diwali for AP Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఈ ఏడాది దీపావళికి ముందే డబుల్ బొనాంజా దక్కబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభవ నిధులు మరియు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు అక్టోబర్‌లోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
జులైలో ఇవ్వాల్సిన పీఎం కిసాన్ నిధులు ఆలస్యంగా ఆగస్టులో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఆలస్యం చేయకుండా అక్టోబర్ 18వ తేదీ దీపావళి పండుగకి ముందు నిధులు రైతుల ఖాతాల్లో జమచేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్రం విడుదల చేసే 21వ విడత పీఎం కిసాన్ నిధులతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా మరో విడత అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది.

మొత్తం 14 వేల రూపాయలను సంవత్సరానికి మూడువిడతలుగా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఆగస్టులో తొలి విడతగా ఐదు వేల రూపాయలు ఇప్పటికే జమ చేసింది. ఇప్పుడు రెండో విడతగా రైతుల ఖాతాల్లో మళ్లీ ఐదు వేల రూపాయలు జమకానున్నాయి. దీంతో పీఎం కిసాన్ నిధులు కలిపి ఒక్కో రైతు ఖాతాలో ఈసారి ఏకంగా 7 వేల రూపాయలు పడతాయి.

మొదటి విడత నిధుల జమ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని తూర్పు వీరాయపాలెంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో విడత నిధుల జమ కార్యక్రమంలో సీఎం ఎక్కడ పాల్గొంటారో త్వరలోనే స్పష్టత రానుంది.

ఈసారి కేంద్రం నుంచి వచ్చే పీఎం కిసాన్ నిధులు ఆరు వేలు, రాష్ట్రం నుంచి వచ్చే అన్నదాత సుఖీభవ నిధులు ఎనిమిది వేలు కలిపి రైతులకు సంవత్సరానికి 20 వేల రూపాయల లబ్ధి కలగనుంది. రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు, కేంద్రం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో వేయనుంది. ఆగస్టులో ఇప్పటికే ఏడు వేల రూపాయలు జమ కాగా, ఇప్పుడు రెండో విడతగా మరో ఏడు వేల రూపాయలు వస్తున్నాయి. మూడో విడతను ఫిబ్రవరిలో జమ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

దీంతో దీపావళి పండుగకు ముందే రైతుల ఖాతాల్లో నిధులు చేరి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేయనున్నాయి.

annadata-sukhibhava-pm-kisan-funds-ap-farmers-october