Bus Accident In AP : మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

పల్నాడు జిల్లా రెడ్డిగూడెం వద్ద సోమవారం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి గుంటలోకి దూసుకెళ్లింది. రోడ్డు విస్తరణ పనుల వద్ద సిమెంట్ పైప్‌లకు తగిలి బస్సు ఒరిగి ఆగిపోయింది.

Private travels bus accident at palnadu

అమరావతి : ఇటీవల ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికులను భయపెడుతున్నాయి. కర్నూల్ జిల్లాలో వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురై 19మంది సజీవ దహనమైన ఘటన తర్వతా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదాల వార్తలు తరుచూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా సోమవారం పల్నాడు జిల్లా రెడ్డిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి గుంటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం సంభవించలేదు.

రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతంలోని భారీ సిమెంట్ పైప్ లకు బస్సు తగిలి ఓ పక్కకు ఒరిగి ఆగిపోయింది. బస్సు నుంచి ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.