Crime News : ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టి…ప్రియురాలి ఆత్మాహత్య యత్నం

గుంటూరులో దారుణం! ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి.. భార్య, బిడ్డపై పెట్రోల్ పోసి దాడి. నిందితురాలి ఆత్మహత్యాయత్నం. చేబ్రోలులో ఉద్రిక్తత..

అమరావతి : ప్రియుడి వేధింపులను భరించలేకపోయిన ఓ యువతి ఏకంగా అతడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పాటు తను కూడా ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటన సంచలనం రేపింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన అలంకుంట మల్లేశ్ (31)కు, తెనాలి సీఎం కాలనీకి చెందిన దుర్గ(28) అనే యువతికి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అప్పటికే దుర్గకు వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై శనివారం తెనాలిలో పంచాయతీ పెట్టారు. అయితే, రాజీ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన దుర్గ పెట్రోలు క్యాన్ తో సుద్దపల్లిలోని మల్లేశ్ ఇంటికి వెళ్లింది.మల్లేశ్ భార్య అర్చనతో వివాదానికి దిగింది. ఆ తరువాత మల్లేశ్ భార్య, కుమారుడు అరుణ్, మల్లేశ్ తల్లి పద్మలపై తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను పోసింది. ఇంటి మీదకూడా పెట్రోల్ చల్లి నిప్పంటించింది.

ఈ సమయంలో దర్గపై కూడా పెట్రోల్ పడడంతో ఆమెతో పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న వెంటనే చేబ్రోలు పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

తనను ప్రేమించకపోతే చంపేస్తానని దుర్గని మల్లేశ్ బెదిరించేవాడని దుర్గ తల్లి ఈ సందర్బంగా వెల్లడించింది. దుర్గ దగ్గర బంగారం, డబ్బు అంతా కాజేశాడని ఆరోపించింది.

ఇవి కూడా చదవండి :

Tirumala Ratha Saptami| తిరుమలలో వైభవంగా రథ సప్తమి వేడుకలు
Mega Heroes | ఆరు నెలల్లో 1000 కోట్ల లక్ష్యంతో మెగా బ్రదర్స్ బాక్సాఫీస్ దండయాత్ర .. సాధ్య‌మేనా?

Latest News