Vijaya Dairy controversy| ఏపీ విజయ డెయిరీ వర్సెస్ తెలంగాణ విజయ డెయిరీ !

రాష్ట్ర విభజనతో నెలకొన్న వివాదాలు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీ విజయ డెయిరీ వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య వివాదస్పదంగా మారింది. తెలంగాణ విజయ బ్రాండ్ ప్రతిష్టను ఏపీ విజయ డెయిరీ సంస్థ దెబ్బతీస్తుందంటూ తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ ఆరోపణలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజకుంది.

విధాత: రాష్ట్ర విభజనతో నెలకొన్న వివాదాలు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీ విజయ డెయిరీ వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య వివాదస్పదంగా మారింది. తెలంగాణ విజయ బ్రాండ్ ప్రతిష్టను ఏపీ విజయ డెయిరీ సంస్థ దెబ్బతీస్తుందంటూ తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ ఆరోపణలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజకుంది.

కల్తీతో వెలుగు చూసిన ఏపీ విజయ బ్రాండ్ వివాదం

రాష్ట్ర విభజన తర్వాత ఈ బ్రాండ్‌పై ఇరు రాష్ట్రాలకు హక్కులు సంక్రమించాయి. తెలంగాణలో సహకార రంగంలో పనిచేస్తున్న విజయ డెయిరీ.. అక్కడి రైతుల నుంచి పాలు సేకరించి, పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు అందిస్తోంది. ఏపీలో మాత్రం సహకార డెయిరీ వ్యవస్థ నిర్వీర్యమై, జిల్లా యూనియన్లుగా విడిపోయాయి. ఇక్కడ పాల సేకరణ వ్యవస్థ
సక్రమంగా లేకపోవడంతో పాలు, పాల ఉత్పత్తులను విజయ బ్రాండ్‌తో ప్రాసెసింగ్ మార్కెటింగ్ చేయడం లేదు. ఏపీ డెయిరీ ఫెడరేషన్ ప్రైవేటు సంస్థలకు ఏపీ విజయ బ్రాండ్ ను మూడేళ్ల క్రితమే ఫ్రాంచైజీ హక్కులు కల్పించింది. ఇందుకోసం లీటర్ పాలకు రూపాయి చొప్పున వసూలు చేస్తుందని సమాచారం.

ఏపీ విజయ డెయిరీ పేరుతో తెలంగాణలో ప్రైవేటు సంస్థల కల్తీ దందా

తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ కొత్త అమిత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య విజయ బ్రాండ్ అమ్మకాల వివాదాన్ని తెరపైకి తెచ్చింది. ఏపీకి చెందిన విజయ డెయిరీకి తెలంగాణలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు లేవు, పాల సేకరణ లేదు అని అలాంటప్పుడు వారు ప్రజలకు పాలు, నెయ్యి ఎలా విక్రయిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఏపీ విజయ డెయిరీ సంస్థను కన్హన్ యూనియన్, మేఘనా ఫుడ్స్ అనే ఓ ప్రైవేటు సంస్థలకు అప్పగించారని, వారు విజయ బ్రాండ్ పేరుతో కల్తీ పాలు, నెయ్యి అమ్ముతున్నారని అమిత్ రెడ్డి ఆరోపించారు. ఏపీ డైయిరీని దళారులకు అప్పగించడంతో మేఘనా ఫుడ్స్ సరఫరా చేసే నెయ్యిలో గుజరాత్ నుంచి వెజిటబుల్ ఆయిల్ ను తీసుకొచ్చి కల్తీ నెయ్యిని తెలంగాణలో విక్రయిస్తున్నారని, ఈ కల్తీ నెయ్యిపై ఎన్డీడీబీ రిపోర్ట్స్ కూడా వచ్చాయని, ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన స్పందించడం లేదు అని అమిత్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్ లో ప్రతి నెల 100టన్నుల కల్తీ, నెయ్యి విక్రయాలతో ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై నెల్లూరు, కర్నూల్ యూనియన్లకు ఫిర్యాదు చేస్తే వారు విజయా బ్రాండ్ ఉపయోగించడం ఆపేశారని, దీంతో తెలంగాణ పాడి రైతులకు నష్టం జరుగుతుందని, పాల ప్యాకెట్ మీ డీటైల్స్ స్కాన్ చేస్తే ప్రైవేట్ కంపెనీల డిటైల్స్ వస్తున్నాయని, ఆ సంస్థను ప్రశ్నిస్తే తాము అమ్మడం లేదంటున్నారని అమిత్ రెడ్డి వెల్లడించారు. డెయిరీ ఫెడరేషన్ నిబంధనల మేరకు ప్రైవేట్ వ్యక్తులు విజయ డెయిరీ పేరు వాడుకోవడానికి వీల్లేదని, ఈ సమస్యపై ఎన్నోసార్లు ఏపీ డెయిరీకి లేఖలు రాసినా స్పందన లేదని తెలిపారు. మా రాష్ట్ర డెయిరీ రైతులకు నష్టం జరిగితే సహించేది లేదన్నారు.

1904లో స్థాపించిన విజయ డెయిరీ.. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం విజయ డెయిరీ ద్వారా రోజుకు సుమారు 4 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించి వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నామని చెప్పారు. కానీ, మార్కెట్‌‌‌‌లో విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాలు, పాల ఉత్పత్తులు విక్రయిస్తూ వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.

కల్తీ నెయ్యిలో ఉండే కెమికల్స్.. పెద్దవారితోపాటు పిల్లల్లో సైతం గుండె జబ్బులకు కారణమవుతున్నాయన్నారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఫ్రాంచైజీ ఇచ్చిన విషయంపై ఏపీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకుంటే రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు అసలైన తెలంగాణ విజయ పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ప్రస్తుతం బ్రాండ్ విభజన పూర్తికాలేదని, నాణ్యతాపరంగా ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నా రు.

ఎక్కడైనా అమ్ముకునే హక్కు మాకుంది : ఏపీ డెయిరీ

ఏపీ విజయ కల్తీ పాలు, నెయ్యి వివాదంలో తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ అమిత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ డెయిరీ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజన తర్వాత విడిపోయిన ఏపీ, తెలంగాణ విజయ డైయిరీలు దేశంలో ఎక్కడైనా ఉత్పత్తులు అమ్ముకోవచ్చు అని, అదే క్రమంలో తెలంగాణలో ఏపీ విజయ ఉత్పత్తుల మార్కెటింగ్ జరుగుతుందని తెలిపింది. ఏపీ మార్కెటింగ్ ప్రయత్నాలను అడ్డుకునేందుకే మాపై ఆరోపణలు చేస్తున్నారని, ఏపీ విజయ డెయిరీపై ఎలాంటి ఫిర్యాదులు లేవు అని, నిరంతరం నాణ్యత పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటివరకు నాణ్యత లోపాలు బయటపడలేదు అని, ల్యాబ్ కు పంపించి పరీక్షలు జరిపించి కల్తీ ఉంటే తెలంగాణకు తెలియజేస్తాం అని ఏపీ డెయిరీ ప్రకటించింది.

Latest News