Sai Srinivas | ఎట్ట‌కేల‌కి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ..రేపు హైద‌రాబాద్‌లో విందు

Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన ఆయన, తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన ఆయన, తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

బుధవారం రాత్రి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో కావ్య రెడ్డి మెడలో మూడుముళ్లు వేసి వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్త పద్ధతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు అతి కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ శుభకార్యం ఎంతో ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రు…

ఈ వివాహానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఇక సినీ, రాజకీయ ప్రముఖుల కోసం మే 1న హైదరాబాద్‌లో భారీ స్థాయిలో విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశముంది.

కెరీర్ విష‌యానికి వ‌స్తే..

సినీ ప్రయాణం విషయానికి వస్తే, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల్లుడు శీను’ చిత్రంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించిన ఆయన, ‘జయ జానకీ నాయక’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘రాక్షసుడు’ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి.

ప్రస్తుతం మాస్ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ‘టైసన్ నాయుడు’తో పాటు మరికొన్ని చిత్రాల్లో ఆయన నటిస్తున్నట్లు సమాచారం. వ్యక్తిగత జీవితంలో కొత్త ఆరంభం చేసిన ఈ యువ హీరో, సినీ జీవితంలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Latest News