Exit Polls 2026: BJP Leads in Bengal, Assam Set for Hat-Trick; UDF Edge in Kerala, DMK Dominates Tamil Nadu
ఎగ్జిట్ పోల్స్ 2026 – ముఖ్యాంశాలు
🔴 బెంగాల్‌లో బీజేపీ-టీఎంసీ మధ్య ఉత్కంఠభరిత పోటీ
🔴 అస్సాంలో బీజేపీకి హ్యాట్రిక్ అవకాశం
🔴 కేరళలో యూడీఎఫ్ స్వల్ప ఆధిక్యం
🔴 తమిళనాడులో డీఎంకే ముందంజ కొనసాగింపు
🔴 దేశవ్యాప్తంగా మిశ్రమ రాజకీయ తీర్పు సంకేతాలు
విధాత భారత్ డెస్క్ | 29 ఏప్రిల్ 2026 | హైదరాబాద్:
దేశ రాజకీయాలను మలుపుతిప్పేలా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికర చిత్రాన్ని ముందుకు తెచ్చాయి. Axis My India, PMARQ, Matrize, Today’s Chanakya, JVC వంటి సర్వే సంస్థల అంచనాలు ఒకే రకంగా లేకపోయినా, రాష్ట్రాలవారీగా స్పష్టమైన రాజకీయ ధోరణులైతే కనిపిస్తున్నాయి. మొత్తం దృశ్యాన్ని పరిశీలిస్తే దేశవ్యాప్తంగా బెంగాల్ మినహా అధికార పార్టీ వైపే అన్ని సర్వేలు మొగ్గు చూపుతున్నాయి.
బెంగాల్: బీజేపీ, టీఎంసీ – నువ్వా? నేనా?.. ఉత్కంఠ తారాస్థాయిలో
బెంగాల్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ-టీఎంసీ మధ్య ఉత్కంఠభరిత పోరు
పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 90 శాతం పోలింగ్ నమోదవ్వడం ఈ ఎన్నికను అత్యంత కీలకంగా మార్చింది. PMARQ అంచనాల్లో బీజేపీకి 150–170 సీట్లు వచ్చే అవకాశం ఉండగా, Matrize 146–161 సీట్లు సూచిస్తోంది. Axis My India కూడా బీజేపీకి ఆధిక్యం చూపుతున్నా, పూర్తిస్థాయి స్వీప్‌పై ఏకాభిప్రాయం లేదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 125–150 సీట్ల వరకు పోటీ ఇస్తుందని పలు అంచనాలు చెబుతున్నాయి. ఈ విభిన్న అంచనాల నేపథ్యంలో బెంగాల్ ఫలితం అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.
అస్సాం: హిమంత హ్యాట్రిక్ కొట్టబోతున్నాడా? అన్ని సర్వేల్లో దూసుకెళ్తున్న బిజేపీ
అస్సాం ఎగ్జిట్ పోల్స్: హిమంత బిశ్వ శర్మకు వరుసగా మూడోసారి విజయం దిశగా సంకేతాలు
అస్సాంలో మాత్రం పూర్తి స్పష్టత కనిపిస్తోంది. Axis My India 88–100 సీట్లు, PMARQ 82–94, Matrize 85–95 సీట్లతో NDAకి భారీ ఆధిక్యం చూపుతున్నాయి. హిమంత బిశ్వ శర్మ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న సదభిప్రాయం ఈ ఫలితాలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. వరుసగా మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
కేరళం: అధికార యూడీఎఫ్ స్వల్ప ఆధిక్యం..
కేరళ ఎగ్జిట్ పోల్స్: యూడీఎఫ్ స్వల్ప ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌తో హోరాహోరీ పోటీ
కేరళంలో పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. PMARQ ప్రకారం యూడీఎఫ్ 71–79 సీట్లు, Matrize అంచనాల్లో 70–75 సీట్లు సాధించే అవకాశం ఉంది. ఎల్‌డీఎఫ్ 62–69 సీట్ల మధ్య నిలిచే అవకాశం ఉంది. పినరయి ప్రభుత్వంపై వ్యతిరేకత పదేళ్ల తర్వాత ప్రభావం చూపుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తమిళనాడు: డీఎంకే ఆధిపత్యం కొనసాగేనా?
తమిళనాడు ఎగ్జిట్ పోల్స్: డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందా? విజయ్ ఫ్యాక్టర్ కీలకం
Tamil Naduలో డీఎంకే కూటమి మరోసారి ముందంజలో ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. PMARQ 125–145 సీట్లు, Matrize 122–132 సీట్లు అంచనా వేయగా, AIADMK కూటమి 65–100 సీట్ల మధ్య పరిమితం కావచ్చు. డీఎంకేకు ఉన్న బలమైన గ్రౌండ్ నెట్‌వర్క్ ఈ ఫలితాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే ఆశ్చర్యకరంగా Axis My India సర్వేలో మాత్రం టివీకే విజయ్‌కి అత్యధిక సీట్లు వస్తున్నట్లు తేలింది.
పుదుచ్చేరి: NDAకి స్వల్ప ఆధిక్యం
పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్: ఎన్డీఏకు స్వల్ప ఆధిక్య సంకేతాలు
పుదుచ్చేరిలో సమాచారం పరిమితంగా ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం NDA కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక అంశాల ప్రభావం ఫలితాలపై కీలకంగా ఉండొచ్చు.
మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సంకేతాలు దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీసేలా ఉన్నాయి. అస్సాంలో బీజేపీ తిరిగి బలంగా నిలుస్తుండగా, తమిళనాడులో స్టాలిన్ ఆధిపత్యం కొనసాగుతోంది. కేరళలో స్వల్ప మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ బెంగాల్ మాత్రం అన్ని అంచనాలను తలకిందులు చేసే అవకాశమున్న రాష్ట్రంగా నిలిచింది. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పిన సందర్భాలు ఉన్నందున, మే 4న వెలువడే అసలు ఫలితాలే ఈ రాజకీయ సమీకరణాలకు తుది రూపం ఇవ్వనున్నాయి.
