భారత్ లో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన టాప్ 10 కంపెనీల జాబితాను రాండ్‌స్టడ్ ఎంప్లయర్ బ్రాండ్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది. జాబితాలో తొలిస్థానంలో గూగుల్ నిలిచింది. ఆ తర్వాతా స్థానాల్లో వరుసగా 2 టాటా గ్రూప్, 3. అమెజాన్, 4. శాంసంగ్ ఇండియా, 5. ఇన్ఫోనిస్, 6. రిలయన్స్ ఇండస్ట్రీస్, 7. ఐటీసీ గ్రూప్, 8. హిందూస్థాన్ యూనిలీవర్, 9. మహీంద్ర&మహీంద్ర, 10. డెల్ టెక్నాలజీస్ కంపెనీలున్నాయి.
అయితే మార్కెట్ విలువ ప్రకారం టాప్ 1 స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంధనం, రిటైల్ & టెలికామ్ నిలువుగా, తర్వాతి స్థానాల్లో వరుసగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్ టెలికమ్యూనికేషన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ బ్యాంకింగ్ & ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ & ఫైనాన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సమాచార సాంకేతికత (ఐటీ), బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆర్థిక సేవలు, లార్సెన్ & టూబ్రో లిమిటెడ్ మౌలిక సదుపాయాలు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బీమా, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ లు నిలిచాయి.