Revanth Reddy| పనితీరు ఆధారంగానే పోస్టింగులు: సీఎం రేవంత్ రెడ్డి

పోలీస్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి అని, పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటో మోడ్ కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇతర శాఖల్లా పోలీస్ శాఖలో ఆటో మోడ్.. ఆటో ప్రమోషన్ ఉండదు అని, పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్వాల్సిందేనని, మీ పనితీరు ఆధారంగానే పోస్టింగులు ఉంటాయిని స్పష్టం చేశారు.

విధాత, హైదరాబాద్ : పోలీస్ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి అని, పోలీస్ శాఖలో ఉద్యోగులు ఆటో మోడ్ కు వెళితే సమాజానికి అత్యంత ప్రమాదకరం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇతర శాఖల్లా పోలీస్ శాఖలో ఆటో మోడ్.. ఆటో ప్రమోషన్ ఉండదు అని, పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవ్వాల్సిందేనని, మీ పనితీరు ఆధారంగానే పోస్టింగులు ఉంటాయిని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ పనితీరు మెరుగుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది అని తెలిపారు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్-2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి పోలీస్ అధికారి పనితీరుకు సంబంధించి నా వద్ద ఏ, బీ, సీ గ్రేడ్ రిపోర్టులు ఉన్నాయని, పేరు చెబితే నేను వారి పనితీరు ఏ గ్రేడ్ లో ఉందో చెప్పగలనని కీలక వ్యాఖ్యలు చేశారు. పనితీరు మెరుగుపరుచుకునేందుకు టార్గెట్ లు పెట్టుకున పనిచేయాలని, పనితీరు ఆధారంగానే పదోన్నతులు, బదిలీలు ఉంటాయని రేవంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వసన్నద్ధం కావలసిన అవసరం ఉందని , రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణపై చర్చించి ప్రణాళికలు రూపొందించుకోవాలని పోలీసు శాఖకు సూచించారు.

ప్రణాళిలకలతోనే మెరుగైన పనితీరు

ప్రతీ ఏటా డిసెంబరులో రిట్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని అభినందిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. మనం ఎక్కడున్నామో తెలిసుకోగలిగితే మనం ఎక్కడికి చేరుకోవాలో తెలుస్తుంది అని, అందుకే ఈ రిట్రీట్ కార్యక్రమం ద్వారా సమస్యలు, పరిష్కారాలపై విశ్లేషించుకుంటున్నామని తెలిపారు. ఛాలెంజ్ లు రెండు రకాలు.. ఒకటి టెక్నికల్ ఛాలెంజ్, రెండోది అడాప్టివ్ ఛాలెంజ్ అని, రిసోర్సెస్, సమయాన్ని కేటాయిస్తే టెక్నికల్ ఛాలెంజ్ ను అధిగమించవచ్చు అని, కానీ… అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో ఎదురైన సమస్య లోతును అర్థంచేసుకోవాలని సూచించారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలి అని, రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ ఉండకూడదనే తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించుకున్నాం అని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 2100 కి.మీ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా పరిగణించుకుంటున్నామని చెప్పారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమిగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని, దేశంలో ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారింది అని, ట్రాఫిక్ సమస్యలతో బెంగుళూరు నగరంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ముంబై, చెన్నై నగరాలు వరదలతో సతమతమవుతున్నాయని, అలాంటి మెట్రోపాలిటన్ నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని రేవంత్ రెడ్డి సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త తరహా నేరాలు పెరగకుండా సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని సీఎం గారు చెప్పారు. నేరాలను నిరోధించడం, నేరస్థులను త్వరగా గుర్తించడానికి AI టెక్నాలజీని వినియోగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

మారిన నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ నైపుణ్యాలు పెరుగాలి

ఏ సమస్య వచ్చినా ప్రజలు మొట్టమొదట సహాయం కోసం ఎదురు చూసేది పోలీసుల కోసమేనని, ఒకప్పుడు తీవ్రవాదం ఒక సమస్యగా ఉండేది.. ఇందుకోసం ఆక్టోపస్, గ్రేహౌండ్స్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు అని, అవినీతిని నిరోధించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, ఫిజికల్ క్రైమ్ నిరోధించేందుకు ఇప్పటి వరకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇప్పుడు నేర స్వరూపమే మారిపోయింది అని, సైబర్ క్రైమ్ పెరిగిపోతున్న ఈ రోజుల్లో మన సిస్టం ను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ వ్యాఖ్యానించారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న అధికారులను నియమించుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. ఉన్న సిబ్బంది, అధికారులను అప్ గ్రేడ్ చేసుకోకపోతే నేరాలను నిరోదించలేరు అని, రిట్రీట్ కార్యక్రమం ద్వారా మీ సమస్యలను గుర్తించి విశ్లేషించుకుంటున్నారని,
సమస్య ఏమిటో గుర్తిస్తే 50 శాతం సమస్య పరిష్కారం అయినట్లేనని చెప్పుకొచ్చారు. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్ మెంట్, ఇతర అంశాలకు సంబంధించి వివిధ సమస్యల పరిష్కారానికి మీరు కొన్ని ప్రతిపాదనలు అందించారు అని,
సమస్యల పరిష్కారానికి మీరు అందించిన ప్రతిపాదనలపై విశ్లేషించాల్సిన అవసరం ఉంది అని రేవంత్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తాం అని, మీ ప్రతిపాదనలపై కమిటీలో విశ్లేషించి చట్టం రూపంలో మా ముందుకు తీసుకురండి అని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకుంటుంది అని రేవంత్ తెలిపారు. పోలీస్ శాఖలో సిబ్బంది రేషనలైజేషన్ చేసుకుని జనాభా ప్రాతిపదికన పోలిసింగ్ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని, బడ్జెట్ ప్రవేశపెట్టకముందే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటే అవసరమైన నిధులను బడ్జెట్ లో కేటాయించుకోవచ్చు అని సూచించారు.

Latest News