ఆ హీరో రెమ్యునరేషన్ రూ.325 కోట్లు.. రజనీ, షారూఖ్‌లను మించి వసూలు

బాలీవుడ్ లో గతంలో సినిమా హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా హీరో, హీరోయిన్లు రెమ్యునరేషన్ తీసుకునేవారు. అప్పట్లో బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్‌ను మించి తెలుగు హీరో ఎన్టీ రామారావు రెమ్యునరేషన్ తీసుకున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. రాను రాను పరిస్థితులు మారడం, కొత్త తరం నటీ నటులు రావడంతో రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. థియేటర్లలో సినిమా ప్రదర్శించడం, డిస్ట్రిబ్యూషన్ ప్రోత్సహాకాలు, ప్రైవేటు కంపెనీలకు ఆడియో, వీడియో రైట్స్ విక్రయించడం, శాటిలైట్ ఛానళ్లు, ఎంటర్ టైన్ మెంట్ యాప్ లకు రైట్స్ అమ్మేయడం ద్వారా నిర్మాతలు పెద్ద ఎత్తున లాభపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏ హీరో కూడా తీసుకోని విధంగా రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో ఆదాయం తీసుకున్నారు.

Reported by: Jagan Mohan Talluri | వినోదం | Edited by: విధాత వినోదం డెస్క్ | Jun 24, 2026, 6:02 pm IST
Read Time: 7 mins
ఆ హీరో రెమ్యునరేషన్ రూ.325 కోట్లు.. రజనీ, షారూఖ్‌లను మించి వసూలు

సినిమా రంగంలో ఒకప్పుడు హీరో రెమ్యునరేషన్ రూ.200 కోట్లు అంటే.. వామ్మో అనుకున్నాం. తక్కువ వ్యవధిలో ఎక్కువ రాబడిని గుంజేందుకు అన్ని రైట్స్‌ను నిర్మాతలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో హీరోలు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే తరహాలో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. బాలీవుడ్ కలెక్షన్ కింగ్ ఎవరంటే నిన్న మొన్నటి వరకు రజినీకాంత్, షారూఖ్ ఖాన్, ప్రభాస్, అర్జున్ పేర్లు విన్పించాయి. కొద్ది రోజులుగా హీరో రణవీర్ సింగ్ విన్పిస్తోంది. ఈ హీరోలందరినీ మించి రణవీర్ సింగ్ రూ.325 కోట్లు ఒక సినిమాలో నటించడం కోసం తీసుకున్నారని బాలీవుడ్ వర్గాల టాక్. అందరి రికార్డును దాటి నెంబర్ వన్ అని నిరూపించుకున్నారు. ఇది కూడా ఒకే ఒక సినిమా ద్వారా తీసుకోవడం గమనార్హం.

బాలీవుడ్ లో గతంలో సినిమా హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా హీరో, హీరోయిన్లు రెమ్యునరేషన్ తీసుకునేవారు. అప్పట్లో బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్‌ను మించి తెలుగు హీరో ఎన్టీ రామారావు రెమ్యునరేషన్ తీసుకున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. రాను రాను పరిస్థితులు మారడం, కొత్త తరం నటీ నటులు రావడంతో రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. థియేటర్లలో సినిమా ప్రదర్శించడం, డిస్ట్రిబ్యూషన్ ప్రోత్సహాకాలు, ప్రైవేటు కంపెనీలకు ఆడియో, వీడియో రైట్స్ విక్రయించడం, శాటిలైట్ ఛానళ్లు, ఎంటర్ టైన్ మెంట్ యాప్ లకు రైట్స్ అమ్మేయడం ద్వారా నిర్మాతలు పెద్ద ఎత్తున లాభపడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏ హీరో కూడా తీసుకోని విధంగా రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో ఆదాయం తీసుకున్నారు.

దురంధర్ బాక్స్ ఆఫీసు విజయం…

ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఆడని విధంగా ధురంధర్ సినిమా విజయదుందుభి మోగించింది. ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొనడమే కాకుండా కలెక్షన్లు అదరగొట్టాయి. వాణిజ్యపరంగా ఘన విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ఆడించడం మూలంగా రూ.3,200 కోట్లు కలెక్షన్లు వసూలు అయ్యాయి. ఇందులో కేవలం భారతదేశం నుంచి రూ.1,900 కోట్లు వసూళ్లు రాగా, ఇతర దేశాల నుంచి రూ.1,300 కోట్లు వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది. ఇది కాకుండా ఇతరత్రా మార్గాల ద్వారా అదనపు లాభం సమకూరడం భారత చలనచిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ గా మారింది. బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో గత హీరోల రెమ్యునరేషన్ ను తిరగ రాసి రణవీర్ సింగ్ చరిత్ర సృష్టించారు.

జైలర్ సినిమాలో నటించిన తమిళ హీరో రజనీకాంత్ రూ.250 కోట్లు, పఠాన్, జవాన్ సినిమాల ద్వారా రూ.200 కోట్లు, కల్కి సినిమాలో నటించి ప్రభాస్ రూ.200 కోట్లు, ఫుష్ప 2 ద రూల్ సినిమా చేసి అర్జున్ రూ.200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారన్నవార్తలు అప్పట్లో సంచలనం రేపాయి. అంతకు ముందు బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు పలు సినిమాలలో నటించి రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటాలు తీసుకున్నారని చెబుతారు. కొన్ని సినిమాల్లో కేవలం లాభాల్లో అత్యధిక వాటాలు తీసుకుని ఎక్కువ లబ్ధి పొందిన ఉదంతాలూ ఉన్నాయి.

మారిన పరిస్థితుల నేపధ్యంలో హీరోలు కూడా తమ పంథాను మార్చుకున్నారు. రెమ్యునరేషన్ బదులు వచ్చే లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. ఈ మేరకు షూటింగ్ డేట్స్ ఇచ్చే సమయంలోనే నిర్మాతతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నారు. దురంధర్ సినిమాలో నటించిన రణవీర్ సింగ్ తక్కువ రెమ్యునరేషన్, లాభాల్లో ఎక్కువ తీసుకున్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించి, అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. తద్వారా రూ.350 కోట్లు రణవీర్ ఖాతాలో పడినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నారు.

మున్ముందు బాలీవుడ్ హీరోలు, ఇతర భాషల హీరోలు రణవీర్ సింగ్ బాటలో నడిచే ప్రమాదముందని, ఫలితంగా సినిమాలు రూపొందించేందుకు ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకవేళ అంచనాలు తల్లకిందులు అయి సినిమా ఫ్లాప్ అయితే హీరో కూడా అదే స్థాయిలో ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుందంటున్నారు.