Dhurandhar 2 | ఏంటి.. ‘ధురంధర్ 2’ క్లైమాక్స్ గ్రాఫిక్స్ కాదా?.. 500 లీటర్ల పెట్రోల్‌తో రియల్ యాక్షన్ సీన్స్

Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. మార్చి 19న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో టాప్-3లో స్థానం సంపాదించింది. ‘ధురంధర్’ సిరీస్‌లోని రెండు భాగాలు కలిపి రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం.

  • By: Sandeep |    movies |    Published on : Apr 30, 2026 9:31 AM IST
Dhurandhar 2 | ఏంటి.. ‘ధురంధర్ 2’ క్లైమాక్స్ గ్రాఫిక్స్ కాదా?.. 500 లీటర్ల పెట్రోల్‌తో రియల్ యాక్షన్ సీన్స్

Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. మార్చి 19న విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో టాప్-3లో స్థానం సంపాదించింది. ‘ధురంధర్’ సిరీస్‌లోని రెండు భాగాలు కలిపి రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం విశేషం.

ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ సరసన సారా అర్జున్ నటించగా, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించాయి. బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పులు, అగ్నికీలలు నడుమ సాగే ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ భారీ యాక్షన్ సన్నివేశాల కోసం గ్రాఫిక్స్ ఉపయోగించలేదని స్పెషల్ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్ విశాల్ త్యాగి వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అది గ్రాఫిక్స్ కాదు..

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “ఫైర్ సీన్స్ కోసం గ్రాఫిక్స్ వాడొద్దని దర్శకుడు ఆదిత్య ధర్ ముందుగానే చెప్పాడు. అందుకే అన్ని సన్నివేశాలను రియల్‌గా తెరకెక్కించాం. చివరి బ్లాస్ట్ సీన్‌ను రూపొందించడం చాలా కష్టమైంది” అని తెలిపారు.

ముఖ్యంగా హీరో భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన చెప్పారు. “మొదట 250 లీటర్ల పెట్రోల్ వాడాలని అనుకున్నారు. కానీ మేము 500 లీటర్లు అవసరమని చెప్పాం. అదనంగా 25 కేజీల పేలుడు పదార్థాలు వాడాం. షూటింగ్ పూర్తయ్యాక రణ్‌వీర్ సింగ్ మమ్మల్ని అభినందించారు” అని విశాల్ త్యాగి వెల్లడించారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు సినిమా మేకింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జియో హాట్ స్టార్‌లో మే 14నుండి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.