హాస్టల్ వాష్ రూమ్ లో ప్రసవం.. శిశువును విసిరేసిన యువతి

హైదరాబాద్ గోల్కొండ పరిధిలో హాస్టల్ వాష్‌రూమ్‌లో యువతి ప్రసవించి నవజాత శిశువును వెంటిలేటర్‌ నుంచి బయటకు విసిరేయడంతో శిశువు మృతి చెందింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Reported by: Tejaswini Nanna | హైదరాబాద్​ | Jun 24, 2026, 4:10 pm IST
Read Time: 2 mins
హాస్టల్ వాష్ రూమ్ లో ప్రసవం.. శిశువును విసిరేసిన యువతి

హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ హాస్టల్‌ వాష్‌రూమ్‌లో యువతి ప్రసవించిన ఘటన కలకలం రేపింది. ఆ యువతి ప్రసవం అనంతరం వాష్‌రూమ్‌ వెంటిలేటర్‌ నుంచి ఆ శిశువును బయటకు విసిరేయడంతో నవజాత శిశువు మృతి చెందింది. తీవ్ర రక్తస్రావమైన యువతి ప్రస్తుతం నిలోఫర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని సమాచారం.

నవజాత శిశువు మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. యువతి గర్భం విషయం తమకు తెలియదని హాస్టల్‌ సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. యువతి తన బావ కారణంగా గర్భం దాల్చి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.