I Bomma | టాలీవుడ్‌కు మళ్లీ పైరసీ ముప్పు.. తిరిగి యాక్టివ్ అయిన ‘ఐ బొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లు
I Bomma | తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్ల పాటు తీవ్రంగా వణికించిన పైరసీ వెబ్‌సైట్లలో ‘ఐ బొమ్మ’ ఒకటి. థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలను గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చి నిర్మాతలకు భారీ నష్టాలు కలిగించిన ఈ వెబ్‌సైట్‌పై పోలీసులు గతంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ‘ఐ బొమ్మ’ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
I Bomma | తెలుగు సినీ పరిశ్రమను కొన్నేళ్ల పాటు తీవ్రంగా వణికించిన పైరసీ వెబ్‌సైట్లలో ‘ఐ బొమ్మ’ ఒకటి. థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలను గంటల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చి నిర్మాతలకు భారీ నష్టాలు కలిగించిన ఈ వెబ్‌సైట్‌పై పోలీసులు గతంలో ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత ‘ఐ బొమ్మ’ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
ఆ అరెస్ట్ అనంతరం ‘ఐ బొమ్మ’తో పాటు ‘బప్పం టీవీ’ వంటి పైరసీ వెబ్‌సైట్లు పూర్తిగా మూతపడినట్టే కనిపించాయి. దీంతో తెలుగు సినిమా పరిశ్రమ కొంత ఊపిరి పీల్చుకుంది. పైరసీ సమస్య క్రమంగా తగ్గుతుందనే ఆశ కూడా వ్యక్తమైంది. అయితే మరోవైపు ‘మూవీ రూల్జ్’ వంటి ఇతర పైరసీ సైట్లు మాత్రం యాక్టివ్‌గా కొనసాగుతూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను లీక్ చేస్తూనే ఉన్నాయి.
మళ్లీ యాక్టివ్..
ఇప్పటికే పలు కొత్త పైరసీ సైట్లు కూడా ప్రేక్షకులకు అక్రమ కంటెంట్ అందిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ‘ఐ బొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లు మళ్లీ యాక్టివ్ కావడం టాలీవుడ్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. మూతపడ్డాయని భావించిన ఈ సైట్లు తిరిగి పనిచేయడం సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.
కొంతమంది నెటిజన్లు దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, పైరసీ కంటెంట్ చూసే వర్గాల్లో మాత్రం ఈ పరిణామం చర్చనీయాంశమైంది. అయితే సినీ పరిశ్రమకు ఇది మరో పెద్ద హెచ్చరికగా మారింది. భారీ బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలకు పైరసీ వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
శాశ్వత పరిష్కారం ఎప్పుడు..
ప్రస్తుతం పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగాలు పైరసీ వెబ్‌సైట్లపై పలు రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. నిర్వాహకులు డొమైన్‌లు మారుస్తూ, కొత్త సర్వర్లు ఉపయోగిస్తూ తప్పించుకుంటున్నారు. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందనే ప్రశ్న మళ్లీ ముందుకు వస్తోంది.
ఓటీటీ వేదికల ప్రభావం, థియేటర్లకు తగ్గుతున్న ప్రేక్షకాదరణతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు సినిమా పరిశ్రమకు పైరసీ మరింత దెబ్బతీస్తోందని సినీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా విడుదలైన తొలి రోజే హై క్వాలిటీ ప్రింట్లు లీక్ కావడం వల్ల థియేటర్ల కలెక్షన్లపై నేరుగా ప్రభావం పడుతోందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ‘ఐ బొమ్మ’ సహా ఇతర పైరసీ సైట్లను పూర్తిగా అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సినీ పరిశ్రమ ప్రభుత్వాన్ని కోరుతోంది. సాంకేతికంగా బలమైన నిఘా వ్యవస్థ, వేగవంతమైన చట్టపరమైన చర్యలు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram