Site icon vidhaatha

Nara Lokesh | నారా లోకేశ్ రెడ్ బుక్‌పై ఏసీబీ కోర్టు విచారణ

జూన్ 18కి విచారణ వాయిదా

విధాత: ఏపీ ఏసీబీ కోర్టులో టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై బుధవారం విచారణ జరిగింది. నారా లోకేష్‌ను అరెస్ట్ చేయాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. రెడ్ బుక్‌లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధనలకు విరుద్ధంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని సీఐడీ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కౌంటర్, అబ్జెక్షన్లు వినేందుకు సమయం ఇవ్వాలని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ కోరారు.

ఈ కేసు విచారణను జూన్ 18కి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. గత ఏడాది యువ‌గ‌ళం పాద‌యాత్రలో లోకేష్ మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలపైన, నాపైన కొంత మంది పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, వారి పేర్లు రెడ్ బుక్‌లో రాసుకుంటున్నామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై సీఐడీ, ఏసీబీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ చట్టపర చర్యలకు ఉపక్రమించింది.

Exit mobile version