Excel sheet | ఒకప్పుడు పెళ్లి (marriage) అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలనేవాళ్లు. కానీ ఇప్పుడు ఆ ధోరణి మారింది. పెద్దలు కుదిర్చిన వివాహమైనా సరే అభిరుచులు, ఆలోచనలు కలవాలని కోరుకుంటున్నారు నేటి తరం యువత. అందుకే ఆచితూచి ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఓ యువకుడు తన పెళ్లి సంబంధాలకు (marriage matches) సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు ఓ ఎక్సెల్ షీట్ (Excel sheet)లో పొందుపరుస్తున్నాడు. తన పెళ్లి ప్రయత్నాలను అత్యంత ప్రొఫెషనల్‌గా, వినూత్నంగా నిర్వహిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
హర్యానాకు చెందిన వికాస్ ప్రస్తుతం పూణె (Pune)లో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంన్నాడు. అతడు ఓ మెటల్ కంపెనీలో డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడి వయసు 28 ఏళ్లు. పెళ్లి చేసుకోవాలని గత కొన్ని రోజులుగా తల్లిదండ్రులు ఒత్తడి తెస్తున్నారు. దీంతో అతడు ఒప్పుకోవడంతో పేరెంట్స్ పెళ్లి సంబంధాలు వెతకడం మొదలు పెట్టారు. అలా ఇప్పటి వరకూ 11 మంది అమ్మాయిలతో అతడు మాట్లాడాడు.
వారి వివరాలన్నింటినీ ఓ ఎక్సెల్ షీట్‌లో పొందుపరిచాడు. వారి పేర్లు, ఫోన్ నంబర్లు, వారితో జరిగిన సంభాషణలు, ఇద్దరి అభిరుచులూ మ్యాచ్ అయ్యాయా..? లేదా..? ఇలా అన్నీ తన వృత్తిలోని నైపుణ్యాన్ని పెళ్లి చూపుల ప్రక్రియకు అన్వయించి ఎక్సెల్ షీట్ తయారు చేశాడు. అతడు వృత్తిపరంగా డేటా అనలిస్ట్ కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని ట్రాక్ చేయడం అలవాటు. పెళ్లి విషయంలోనూ అతడు దాన్నే ఫాలో అయ్యాడు. ఆ షీట్‌లో అమ్మాయి తల్లిదండ్రుల ఫీడ్ బ్యాక్ కాలమ్ కూడా ఉండటం విశేషం.
మరోప్రత్యేకత ఏంటంటే ఇందులో వికాస్ తనకోసం కూడా ఓ కాలమ్‌ను క్రియేట్ చేయడం. అదే ఒపీనియన్ కాలమ్. అందులో మాట్లాడిన అమ్మాయి గురించి ఒక్కమాటలో తన మనసుకు అనిపించింది అక్కడ రాసుకున్నాడు. మ్యాచ్ ఏమైంది అని తన తల్లిదండ్రులు రోజూ అడగకుండా.. ఇది చాలా మంచి ప్రయత్నం అని అతడు చెబుతున్నాడు. ఈ ఎక్సెల్ షీట్ అతడి తల్లిదండ్రులకు కూడా యాక్సెస్ ఉంది. దీంతో పెళ్లి అప్‌డేట్‌ను వాళ్లు ఎప్పటికప్పుడు దీని ద్వారా తెలుసుకుంటున్నారట.
తల్లిదండ్రులకు కూడా తన ఈ ఐడియా నచ్చిందని చెబుతున్నాడు వికాస్. తన ఫ్రెండ్స్ కూడా ఇదే ఫాలో అవుతామని చెబుతున్నారంట. వికాస్ తయారు చేసిన పెళ్లి ఎక్సెల్ షీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లిపై అతడికి ఓ క్లారిటీ ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
GHMC Reorganisation | జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ: మూడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు సర్కిళ్ల పంపకం – ఇదే జాబితా..
Ambati Rambabu bail| మాజీ మంత్రి అంబటికి అటు బెయిల్..ఇటు పీటీ వారెంట్ !
