• Telugu News
  • /Hyderabad

GHMC Reorganisation | జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ: మూడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు సర్కిళ్ల పంపకం – ఇదే జాబితా..

హైదరాబాద్‌ను మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం చేపట్టిన జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 60 సర్కిళ్లను పునర్విభజించింది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చే సర్కిళ్ల పూర్తి వివరాలు ఇవే.

Reported by: ADHARVA | హైదరాబాద్​ | Feb 11, 2026, 6:44 pm IST
Read Time: 6 mins
GHMC Reorganisation | జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ: మూడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు సర్కిళ్ల పంపకం – ఇదే జాబితా..

GHMC Reorganisation: Full List of Circles Under Three Municipal Corporations in Hyderabad

జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ – సారాంశం

హైదరాబాద్ నగర పాలక వ్యవస్థను ప్రభుత్వం మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల మధ్య 60 సర్కిళ్లను పునర్విభజిస్తూ పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.

విధాత సిటీ బ్యూరో | హైదరాబాద్​:

GHMC Reorganisation | హైదరాబాద్ నగర పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ నగరాన్ని మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. ఈ మార్పుల్లో భాగంగా మొత్తం 60 సర్కిళ్లను జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ల మధ్య విభజించారు. స్థానిక సమస్యలకు వేగంగా స్పందించేందుకు ఈ కొత్త వ్యవస్థను రూపొందించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 సర్కిళ్లు ‌‌–  పూర్తి వివరాలు

Charminar monument in Hyderabad highlighting GHMC Charminar zone administration

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆరు జోన్లలో మొత్తం 30 సర్కిళ్లు కొనసాగనున్నాయి.

శంషాబాద్ జోన్‌లో – ఆదిభట్ల, బడంగ్‌పేట్, జల్​పల్లి, శంషాబాద్ సర్కిళ్లు ఉన్నాయి.

రాజేంద్రనగర్ జోన్‌లో – రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, జంగంపేట్ సర్కిళ్లు కొనసాగుతాయి.

చార్మినార్ జోన్‌లో – సంతోష్‌నగర్, యాకుత్‌పురా, మలక్‌పేట్, చార్మినార్, మూసారాంబాగ్ సర్కిళ్లు ఉన్నాయి.

గోల్కొండ జోన్‌లో – గోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్ సర్కిళ్లు ఉన్నాయి.

ఖైరతాబాద్ జోన్‌లో – ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్ సర్కిళ్లు కొనసాగుతాయి.

సికింద్రాబాద్ జోన్‌లో కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్‌పేట్, తార్నాక, మెట్టుగూడ సర్కిళ్లు ఉన్నాయి.

సైబరాబాద్ పరిధిలో 16 సర్కిళ్లు –  పూర్తి వివరాలు

Cyber Towers area in Hitech City Hyderabad representing Cyberabad municipal corporation zone

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు జోన్లలో 16 సర్కిళ్లను ఏర్పాటు చేశారు.

శేరిలింగంపల్లి జోన్‌లో – నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి సర్కిళ్లు ఉన్నాయి.

కూకట్‌పల్లి జోన్‌లో – మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్ సర్కిళ్లు కొనసాగుతాయి.

కుత్బుల్లాపూర్ జోన్‌లో – చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజుల రామారం, నిజాంపేట్, దుండిగల్, మేడ్చల్ సర్కిళ్లు ఉన్నాయి.

ఈ విభజనతో ఐటీ కారిడార్‌తో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల పాలనకు ప్రత్యేక ప్రాధాన్యం లభించనుంది.

మల్కాజిగిరి పరిధిలో 14 సర్కిళ్లు – పరిపాలనకు కొత్త దిశ

Keesara Gutta temple near Hyderabad in Malkajgiri municipal corporation region

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో –మూడు జోన్లలో మొత్తం 14 సర్కిళ్లు ఉన్నాయి.

మల్కాజిగిరి జోన్‌లో – కీసర, ఆల్వాల్, బోయిన్‌పల్లి, మౌలాలి, మల్కాజిగిరి సర్కిళ్లు ఉన్నాయి.

ఉప్పల్ జోన్‌లో – ఘట్‌కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ సర్కిళ్లు కొనసాగుతాయి.

ఎల్‌బీనగర్ జోన్‌లో –య నాగోల్, సరూర్‌నగర్, ఎల్‌బీనగర్, హయత్‌నగర్ సర్కిళ్లు ఉన్నాయి.

ఈ కొత్త విభజనతో తూర్పు హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనులకు మరింత వేగం వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సర్కిళ్ల స్పష్టమైన పంపిణీతో హైదరాబాద్ పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. స్థానిక సమస్యలపై వేగంగా స్పందించేందుకు ఈ వ్యవస్థ దోహదపడనుంది.