TTD Vaikunta Dwara Darshanam | హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం( TTD )లో వైకుంఠ ద్వార దర్శనాలు( Vaikunta Dwara Darshanam ) డిసెంబర్ 30వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో వైకుంఠ ద్వార దర్శనాలకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్( Online Registration ) చేసుకునేందుకు టీటీడీ( TTD ) వెసులుబాటు కల్పించింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్( Online Registration ) ప్రక్రియ గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. డిసెంబర్ 1 వరకు టీటీడీ వెబ్‌సైట్, మొబైల్ యాప్, ప్రభుత్వ వాట్సాప్ సర్వీసెస్ ద్వారా రిజిస్ట్రేషన్‌కు సౌకర్యం కల్పించారు. డిసెంబర్ 2న ఈ-డిప్( e Dip )లో ఎంపికైన భక్తుల ఫోన్‌లకు టోకెన్ వివరాలు మెసేజ్ ద్వారా అందుతాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
తొలి మూడురోజులకు వైకుంఠ ద్వారా దర్శనాలకు ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in, మొబైల్ యాప్, వాట్సాప్‌లో ఏపీ గవర్నమెంట్‌బాట్‌లో టీటీడీ ఆలయాల విభాగంలో ఎలక్ట్రానిక్ డిప్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి.
వాట్సాప్ బాట్ ద్వారా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకునే భక్తులు ఏపీ గవర్నమెంట్ సర్వీసెస్ నెం: 9552300009కు ముందుగా గోవిందా, హాయ్ అని మెసేజ్ చేయాలి. అనంతరం ఇంగ్లీష్, తెలుగు భాషలను సెలక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ కోసం EN, తెలుగు కోసం TE అని రిప్లే ఇవ్వాల్సి ఉంటుందని టీటీడీ పేర్కొంది. అనంతరం మీరు ఎంచుకున్న భాషలో సర్వీసెస్ విండో కనిపిస్తుంది. ఆ సర్వీసెస్ విండోను ఓపెన్ చేసుకుని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత టీటీడీ టెంపుల్ సర్వీసెస్ ఓపెన్ చేయగానే వైకుంఠ ద్వార దర్శనం (డిప్) రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషలను ఎంపిక చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. తర్వాత చిరునామా, పిన్ కోడ్ నమోదు చేయాలి.
అనంతరం డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిల్లో దర్శనం కావాల్సిన రోజులను, మూడు రోజులను ప్రాధాన్యతగా ఎంపిక చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు టీడీపీ పేర్కొంది. తర్వాత భక్తుల ఆధార్ కార్డులో ఉన్న విధంగా పేరు, వయస్సు, లింగం, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలని.. ఆ తర్వాత వివరాలను సరి చూసుకుని సబ్‌మిట్ చేయాల్సి ఉంటుందని.. ఒకసారి నమోదు చేసిన పేర్లను మార్చడానికి వీలుండదని స్పష్టం చేసింది. ఆధార్ నంబర్, పిన్ కోడ్‌ను తప్పుగా నమోదు చేస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పింది. భక్తుల వివరాలు విజయవంతంగా SUBMIT చేయగానే ACKNOWLODGEMENT మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రిఫరెన్సు నెంబర్‌గా పరిగణించనున్నట్లు తెలిపింది. మొబైల్ నెంబర్, ఆధార్ కార్డుకు ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుందని వెల్లడించింది.
