Maha Shivaratri | మహా శివరాత్రికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. ఈ క్రమంలో భక్తులు శివరాత్రి పర్వదినానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా చేసుకుంటున్నారు. శివాలయాన్నీ కూడా ముస్తాబవుతున్నాయి. భక్తులు ఉపవాస దీక్ష, జాగరం ఉండేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. అయితే ఉపవాస దీక్ష, జాగరం సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల సందర్భంగా పరమ శివుడికి ఈ ఐదు వస్తువులను సమర్పించకూడదని పండితులు సూచిస్తున్నారు. ఆ వస్తువులు ఏంటో చూద్దాం.
తులసి ఆకులు
దాదాపు ప్రతి హిందువు తమ ఇంటి ఆవరణలో తులసి చెట్టును పెంచుకుంటున్నారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే తులసికి నిత్యం పూజలు చేస్తుంటారు. కానీ మహా శివరాత్రి రోజున తులసి ఆకులు పూజకు పనికి రావని పండితులు చెబుతున్నారు. తులసి విష్ణువుకు ప్రీతికరమైనది అందుకే శివ పూజలో దీనిని ఉపయోగించరు. అందువలన శివరాత్రి సమయంలో శివలింగానికి తులసి దళాలను సమర్పించకూడదు.
కేతకి పువ్వులు
మహా శివరాత్రి రోజున రకరకాల పూలతో శివుడిని అలంకరిస్తారు. అయితే కేతకి పువ్వులు మాత్రం శివపూజకు పనికి రావని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే పురాణాల ప్రకారం కేతకి పువ్వు బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినప్పుడు దానికి సాక్ష్యంగా నిలిచిందంట. అందువలన అబద్ధపు సాక్ష్యం చెప్పినందుకు పరమేశ్వరుడు శివ పూజలో కేతకి పూలు ఉండవు, వీటిని పూజకు వాడకూడదు అని శాపం పెడతాడట.
కుంకుమ
శాస్త్రాల ప్రాకారం, శివ లింగానికి కుంకుమ సమర్పించకూడదు. ఎందుకంటే ఇది పార్వతీ దేవికి చాలా ప్రీతికరమైనది, ఆమెకు ఎప్పుడూ సమర్పించడం వలన దీనిని శివలింగానికి సమర్పించకూడదట.
శంఖం నుండి నీటిని అందించడం
శివ రాత్రి రోజు శివలింగానికి శంఖాన్ని ఉపయోగించి నీటితో అభిషేకం చేయడం అశుభ కరం. శంఖం విష్ణువుతో ముడిపడి ఉంటుంది కాబట్టి, శివుడికి ఎప్పుడూ శంఖంతో నీటిని అందించకూడదంట.
బియ్యం గింజలు
గ్రంథాల ప్రకారం, శివలింగానికి విరగని బియ్యాన్ని మాత్రమే సమర్పించాలి. అలాగే పగలని బియ్యం గింజలు సమర్పించకూడదు. ఇక అభిషేకం తర్వాత శివలింగానికి అక్షింతలు సమర్పించడం చాలా మంచిది.
