విధాత,దేవీపట్నం: అందాల జలపాతాలు, అద్భుతమైన కొండకోనల పాపికొండల విహారయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఆదివారం నుంచి పర్యాటక శాఖ బోట్లను ప్రారంభించారు. 21 నెలల విరామం తర్వాత పర్యాటకశాఖకు చెందిన హరిత బోటు ఉదయం తొమ్మిది గంటలకు పోచమ్మగండి నుంచి పాపికొండల యా త్రకు బయలుదేరి వెళ్లింది. సుమారు 29మందితో బయలుదేరి వెళ్లి తిరిగి 5గంటలకు గమ్యస్థానానికి చేరుకుంది.