విధాత,అమరావతి,3జూన్:ఎపి సమాచార కమీషన్ లో రాష్ట్ర సమాచార కమీషనర్లుగా నియమితులైన యు.హరిప్రసాద్ రెడ్డి మరియు కె.చెన్నారెడ్డి లు ప్రమాణం చేయనున్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జిపియంఅండ్ ఎఆర్)కె.ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.4వతేది శుక్రవారం మధ్యాహ్నం 12గం.లకు అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చే హరిప్రసాద్ రెడ్డి,చెన్నారెడ్డిలతో రాష్ట్ర సమాచార కమీషనర్లుగా ప్రమాణం(Administered Oath)చేయించనున్నారని ఆయన తెలిపారు.సమాచార హక్కు చట్టం 2005 కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 53 తేది.25-5-2021 ద్వారా రాష్ట్ర సమాచార కమీషన్ కు కమీషనర్లుగా హరిప్రసాద్ రెడ్డిని,చెన్నారెడ్డిని నియమించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర సమాచార కమీషనర్ గా నియమితులైన కాకర్ల చెన్నారెడ్డి వైయస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందినవారు.ఎంకామ్ ఎల్ఎల్బి విద్యార్హత కలిగి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం లోను,జిల్లా కోర్టుల్లోను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ ఈవృత్తిలో 15యేళ్ళకు పైగా అనుభవం కలిగి ఉన్నారు.ఆయన ముఖ్యంగా వివిధ సివిల్,క్రిమినల్ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులతో పాటు మానవ హక్కుల కమీషన్,ఆర్బిట్రేషన్,భూ,రెవెన్యూ, లేబర్,వినియోగదారుల,పరోక్ష పన్నులకు సంబంధించిన పలు కేసుల పరిష్కారంపై కృషి చేస్తుంటారు.
అలాగే మరో సమాచార కమీషనర్ గా నియమితులైన యు.హరిప్రసాద్ రెడ్డి సీనియర్ జర్నలిస్టుగా జర్నలిజం రంగంలో విశేష అనుభవం కలిగి ఉన్నారు.ఆయన జర్నలిజం రంగంలో సుమారు 20యేళ్ల వరకూ అనుభవం కలిగి ఉన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి చరిత్ర విభాగంలో మాస్టర్ డిగ్రీ పొందిన ఈయన ప్రధానంగా రాజ్యాంగ విలువలు,డెమోక్రాటిక్ కల్చర్,ప్రాధమిక హక్కులు వంటి అంశాల్లో అనుభవం కలిగి ఉన్నారు. తెలుగు డైలీలో 1000వరకూ ఎడిటోరియల్ పేజిలో ఆర్టికల్స్ వ్రాశారు.
సమాచార కమీషనర్లుగా ప్రమాణం చేయనున్న యు.హరిప్రసాద్ రెడ్డి, కె.చెన్నారెడ్డి
<p>విధాత,అమరావతి,3జూన్:ఎపి సమాచార కమీషన్ లో రాష్ట్ర సమాచార కమీషనర్లుగా నియమితులైన యు.హరిప్రసాద్ రెడ్డి మరియు కె.చెన్నారెడ్డి లు ప్రమాణం చేయనున్నారని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జిపియంఅండ్ ఎఆర్)కె.ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.4వతేది శుక్రవారం మధ్యాహ్నం 12గం.లకు అమరావతి సచివాలయం మొదటి భవనం సియం సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాధ్ దాస్ చే హరిప్రసాద్ రెడ్డి,చెన్నారెడ్డిలతో రాష్ట్ర సమాచార కమీషనర్లుగా ప్రమాణం(Administered Oath)చేయించనున్నారని ఆయన తెలిపారు.సమాచార హక్కు చట్టం 2005 కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల […]</p>
Latest News

తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి