Site icon vidhaatha

ఆయుర్వేద వైద్య శిబిరం కు విశేష స్పందన

విధాత:కరోనా మహమ్మారిని పారదోలేందుకు నడుం బిగించిన ఆయుష్… నేషనల్ మెడికల్ అసోసియేషన్ “ఆయుర్వేద మహ్” పేరిట చేపట్టిన ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నది. ఆయుష్ కమిషనర్ కల్నల్ డాక్టర్ వి రాములు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 40 కేంద్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు జరుగుతుండగా… మూడు రోజులపాటు జరిగే ఈ శిబిరం విజయవాడ బీసెంట్ రోడ్డు ఇంప్ కాప్స్ ఆసుపత్రిలో సోమవారం ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ మధుసూదన శర్మ, NMA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేముల ప్రకాష్, ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేష్ కుమార్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ ధరణి కుమార్, ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాయి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు..

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో 8 జిల్లాల్లో జూలై 1 నుంచి రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చి, ఉదయం 6 గంటల వరకూ కొనసాగుతుందన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉంటుందన్నారు. రాత్రి తొమ్మిది గంటల తరవాత అన్ని దుకాణాలు, ఇతర సముదాయాలు మూసివేయాలన్నారు.

Exit mobile version