Site icon vidhaatha

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసిన తెదేపా నాయకులు

విధాత:కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలిసిన ప్రకాశం,నెల్లూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ శాసనసభ్యలు,మాజీ శాసనసభ్యలు,నాయకుల బృందం.వెలుగొండ ప్రాజెక్టు సమస్యపై కేంద్ర మంత్రిని కలిసిన బృందం.

వెలుగొండ ప్రాజెక్టును తక్షణమే అనుమతి పొందిన ప్రాజెక్టుగా కేంద్ర గెజిట్‌లో చేర్పించాలని కేంద్ర మంత్రిని కోరిన ప్రకాశం, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ బృందం.ప్రకాశం జిల్లా కరువు పరిస్థతిని, జిల్లా నైసర్గిక స్వరూపాన్ని, వెలుగొండ ప్రాజెక్టు ప్రాధాన్యతను సవివరంగా కేంద్రమంత్రికి వివరించిన తెదేపా బృందం.

Exit mobile version