Site icon vidhaatha

తెగిన క‌మలాపురం వంతెన‌

విధాత‌: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లా కమలాపురంలో పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కూలింది. కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెలిగల్లు జలాశయం నాలుగు గేట్లు ఎత్తేయడంతో భారీగా వరద నీరు వంతెనపై అంచు వరకు రెండు రోజులుగా ప్రవహించడంతో వంతెన బాగా నాని నిన్న సాయంత్రం నుంచి కుంగుతూ వస్తోంది.

ఏడు మీటర్లకు పైగా వంతెన కూలడంతో కిలోమీటర్‌ దూరంలో వాహనాలు నిలిపేశారు. అనంతపురం నుంచి కడపకు వెళ్లే జాతీయ రహదారి కావడంతో కడప నుంచి తాడిపత్రి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఈ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించడానికి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

Exit mobile version