పాట్నా: తొమ్మిది రోజుల వ్యవధిలోనే బీహార్‌లో మరో వంతెన కూలిపోయింది. దీంతో ఇటీవలికాలంలో కూలిన వంతెనల సంఖ్య ఆరుకు పెరిగింది. మధుబని, సుపౌల్ మధ్య భూతాహి నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దీనిపై ఎక్స్‌లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక వీడియో విడుదల చేస్తూ జేడీయూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘బీహార్‌లో 9 రోజుల వ్యవధిలో ఐదో వంతెన కూలిపోయింది. భూతాహి నదిపై మధుబని, సుపౌల్ మధ్య నిర్మాణలో ఉన్న వంతెన కూలింది. మీకు తెలుసా? తెలుసుకునేందుకు ప్రయత్నించండి.. అంటూ #Bihar #Bridge అనే హ్యాష్‌ట్యాగ్స్ పెట్టారు. ఈ వంతెన కూలిన ప్రాంతం నేపాల్‌కు సరిహద్దులో ఉన్నది. దాదాపు రెండేళ్లుగా ఈ వంతెన నిర్మాణంలో ఉన్నదని ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఈ బ్రిడ్జ్ పిల్లర్ ఒకటి కొట్టుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. నేపాల్‌లోని పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలతో భూతాహి నది పొంగిపొర్లుతున్నదని అధికారులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జ్‌ని 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. వంతెన కూలిపోవడంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వంతెనను నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌కే మరమ్మతు బాధ్యత అప్పగించారు.గతవారం అరారియా, సివాన్, తూర్పు చంపారన్ జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి. గురువారం కూడా కిషన్‌గంజ్ ఏరియాలో ఇటువంటి ఘటనే చోటు చేసుకున్నది.
9 రోజుల వ్యవధిలోనే బీహార్‌లో కూలిన మరో వంతెన
తొమ్మిది రోజుల వ్యవధిలోనే బీహార్‌లో మరో వంతెన కూలిపోయింది. దీంతో ఇటీవలికాలంలో కూలిన వంతెనల సంఖ్య ఆరుకు పెరిగింది. మధుబని, సుపౌల్ మధ్య భూతాహి నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు

Latest News
ఎలాన్ మస్క్ కు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా లేఖ
బాలయ్యకి క్షమాపణలు..
దీన స్థితిలో ప్రముఖ టాలీవుడ్ నటి ..
రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!
2026లో ఈ నాలుగు రాశుల వారికి పెళ్లి ఖాయం..! మరి మీ రాశి ఉందా..?
శనివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి నూతన గృహ, వాహన యోగాలున్నాయి..!
వనదేవతల జాతర మేడారంలో అభివృద్ధి తోరణం
వరంగల్ కాంగ్రెస్ ‘తూర్పులో మార్పు’ రాజకీయం!
భారత్‌తో కలిసి ట్రంప్ ఐదు దేశాల కొత్త ‘కూటమి’!
‘మెస్సీ vs మేస్త్రీ’ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.100 కోట్లు: దాసోజు ఫైర్