Bihar Assembly Elections| బీహార్‌ పీఠం మళ్లీ ఎన్డీఏదే..!

దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకెలుతుంది. మొత్తం 243స్థానాల్లో ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 122 దాటిన ఎన్డీయే కూటమి 174స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది.

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar elections) ఫలితాల(result)లో అధికార ఎన్డీఏ(NDA LEAD) కూటమి స్పష్టమైన ఆధిక్యత దిశగా దూసుకెలుతుంది. మొత్తం 243స్థానాల్లో ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 122 దాటిన ఎన్డీయే కూటమి 174స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుంది. నితీష్ కుమార్ సారధ్యంలోని జేడీయూ 79, బీజేపీ 74, ఎల్ జేపీ(ఆర్ వీ) 17 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద పార్టీగా జేడీయూ నిలిచే అవకాశం కనిపిస్తుంది.

ఇండియా కూటమికి చెందిన మహాఘట్ బంధన్ 66స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఆర్జేడీ 47, కాంగ్రెస్ 11స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ప్రతిపక్ష నేత తేజస్వీయాదవ్ ఆధిక్యతలో ఉన్నారు.