Emmanuel Macron | ముంబై వాసుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన ఫ్రాన్స్ అధ్య‌క్షుడు..

భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ ఫ్రాన్స్ అధ్య‌క్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముంబై వాసుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో (Marine Drive) మాక్రాన్ జాగింగ్‌కు వెళ్లారు.

Emmanuel Macron

Emmanuel Macron | ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సోమ‌వారం రాత్రి దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో ల్యాండ్ అయ్యారు. ఈ సంద్భంగా మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌, ఇత‌ర అధికారులు మాక్రాన్ దంప‌తుల‌కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ఇక ముంబైలో అడుగుపెట్టిన మాక్రాన్ ఇవాళ ఉద‌యం న‌గ‌ర వాసుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు.

ఇవాళ ఉద‌యం లేవ‌గానే ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో (Marine Drive) మాక్రాన్(Emmanuel Macron) జాగింగ్‌కు వెళ్లారు. ఉద‌యం జాగింగ్‌కు వ‌చ్చిన న‌గ‌ర వాసులు ఫ్రాన్స్ అధ్య‌క్షుడిని చూసి ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. కొంద‌రు తొలుత మాక్రాన్‌ను గుర్తుప‌ట్ట‌లేక‌పోయారు. ఆ త‌ర్వాత ఫ్రాన్స్ అధ్య‌క్షుడు అని తెలుసుకుని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఫొటోలు, వీడియోలు తీసి త‌మ కెమెరాల్లో బంధించారు. ఓ దేశాధినేత ఇలా సాధార‌ణ సిటిజ‌న్‌లా జాగింగ్ చేయ‌డం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

కీల‌క డీల్‌..

కాగా, ఢిల్లీలో జ‌రుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ 2026 (India AI Impact Summit 2026)లో మాక్రాన్ పాల్గొన‌నున్నారు. ఇక ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్‌-ఫ్రాన్స్ (India–France) మ‌ధ్య కీల‌క ర‌క్ష‌ణ ఒప్పందం కుదిరే అవ‌కాశం ఉంది. రూ.3.25 ల‌క్ష‌ల కోట్ల‌తో 114 ర‌ఫేల్ యుద్ధ‌విమానాల స‌ర‌ఫ‌రాకు సంబంధించి డీల్ కుదిరే అవ‌కాశం ఉంది. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ స‌మ‌యంలో ఈ డీల్‌పై ఇరు దేశాల నేత‌లు సంత‌కాలు చేయ‌చ‌నున్నారు.

వెల్‌క‌మ్ మై ఫ్రెండ్‌..

ఇక భార‌త్‌లో అడుగుపెట్టిన మాక్రాన్‌కు ప్ర‌ధాని మోదీ ఎక్స్ వేదిక‌గా స్వాగ‌తం ప‌లికారు. ఈ పర్యటనలో భారత్‌-ఫ్రాన్స్ సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ మేర‌కు మై డియ‌ర్ ఫ్రెండ్‌ ముంబైలో క‌లుద్దాం అంటూ ప్ర‌ధాని మోదీ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

 

ఇవి కూడా చదవండి :

Avi Prasad IAS| మూడు పెళ్లిళ్ల ఐఏఎస్ అధికారి..ముగ్గురు భార్యలు ఐఏఎస్ లే !
BioAsia 2026 : ఫ్యూచర్ విజన్ పాలసీలతో తెలంగాణ పురోగమనం : సీఎం రేవంత్ రెడ్డి

Latest News