PM Modi | ప్ర‌ధాని మోదీని వ‌రించిన మ‌రో అంత‌ర్జాతీయ అవార్డు

PM Modi గ్రాండ్ క్రాస్‌ను ప్ర‌దానం చేసిన ఫ్రాన్స్ అధ్య‌క్షుడు విధాత‌: ప్ర‌ధాని మోదీ (Modi) ని వ‌రించిన అంత‌ర్జాతీయ అవార్డుల జాబితాలోకి మ‌రొక‌టి వ‌చ్చి చేరింది. ప్ర‌స్తుతం ఫ్రాన్స్ (France)nప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌కు ఆ దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కార‌మైన ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియ‌న్ ఆఫ్ హాన‌ర్ ల‌భించింది. ఫ్రెంచ్ అధ్య‌క్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ఈ అవార్డును మోదీకి ప్ర‌దానం చేశారు. నెపోలియ‌న్ బొనాపార్టే ప్రారంభించిన లీజియ‌న్ ఆఫ్ హాన‌ర్‌లో అయిదు […]

PM Modi | ప్ర‌ధాని మోదీని వ‌రించిన మ‌రో అంత‌ర్జాతీయ అవార్డు

PM Modi

  • గ్రాండ్ క్రాస్‌ను ప్ర‌దానం చేసిన ఫ్రాన్స్ అధ్య‌క్షుడు

విధాత‌: ప్ర‌ధాని మోదీ (Modi) ని వ‌రించిన అంత‌ర్జాతీయ అవార్డుల జాబితాలోకి మ‌రొక‌టి వ‌చ్చి చేరింది. ప్ర‌స్తుతం ఫ్రాన్స్ (France)nప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న‌కు ఆ దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కార‌మైన ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియ‌న్ ఆఫ్ హాన‌ర్ ల‌భించింది. ఫ్రెంచ్ అధ్య‌క్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ఈ అవార్డును మోదీకి ప్ర‌దానం చేశారు.

నెపోలియ‌న్ బొనాపార్టే ప్రారంభించిన లీజియ‌న్ ఆఫ్ హాన‌ర్‌లో అయిదు స్థాయులుంటాయి. ఇందులో మోదీకి ప్ర‌దానం చేసిన‌ది అత్యున్న‌త‌మైన గ్రాండ్ క్రాస్‌ (Grand Cross). ఈ అవార్డును ఎక్కువ‌గా ఫ్రెంచ్ జాతీయుల‌కే ఇస్తున్న‌ప్ప‌టికీ.. ఫ్రాన్స్ అభివృద్ధికి ఇతోధికంగా సాయ‌ప‌డిన విదేశీయులకూ ఈ అవార్డు అరుదుగా ల‌భిస్తుంది.

ఇక‌పై అక్క‌డా యూపీఐ చెల్లింపులు

రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిన మోదీకి గురువారం రెడ్ కార్పెట్ స్వాగ‌తం ల‌భించింది. ఆ దేశ ప్ర‌ధాని ఎలిజ‌బెత్ బోర్నె మోదీకి స్వాగ‌తం ప‌లిక‌గా.. అనంత‌రం ఆమెతో భేటీ అయ్యారు. ఇక‌పై ఫ్రాన్స్‌లోనూ యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌ర‌పొచ్చ‌ని మోదీ ప్ర‌క‌టించారు. ఫ్రాన్స్ ప్ర‌భుత్వంతో ఆమేర‌కు ఒప్పందం చేసుకున్నామ‌ని… త్వ‌ర‌లోనే ఈఫిల్ ట‌వ‌ర్ వ‌ద్ద జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఈ చెల్లింపులు మొద‌ల‌వుతాయ‌న్నారు.