Vrushakarma | భయానక ఫాంటసీ ప్రపంచం ‘వృషకర్మ’… టీజర్‌లో కొత్త అవతారంలో కనిపించి ఆసక్తి పెంచిన చైతూ
Vrushakarma | గత ఏడాది విడుదలైన తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వృషకర్మ. ఈ చిత్రానికి విరూపాక్షతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు.
Vrushakarma | గత ఏడాది విడుదలైన తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగ చైతన్య ఇప్పుడు మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం వృషకర్మ. ఈ చిత్రానికి విరూపాక్షతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం నాగ చైతన్య ఏడాదికి పైగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. కథపై పూర్తి నమ్మకం ఉండటంతో సినిమా పూర్తయ్యే వరకు ఎంతో ఓపికగా పని చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ద్వారా ‘వృషకర్మ’ ప్రపంచం ఎలా ఉండబోతోందో చిన్న సాంపిల్ చూపించారు.
టీజర్‌లో ఒక దుష్టశక్తి సృష్టి వినాశనం కోసం అవతరిస్తుందని చూపించారు. అతని నోటి నుంచి పుట్టే గబ్బిలం ఎవరినైనా తాకితే వారి ప్రాణాలు పోతాయని చూపిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. అలాంటి ప్రమాదకర శక్తిని ఆపగలిగేది ఒక్క వృషకర్మ అనే హీరో మాత్రమే అని కథలో ప్రధాన అంశంగా చూపించారు.అయితే పూర్తి కథను బయటపెట్టకుండా దర్శకుడు చాలా జాగ్రత్తగా టీజర్‌ను రూపొందించినట్టు కనిపిస్తోంది. కథలోని ప్రధాన ట్విస్టులు రివీల్ చేయకుండా, హీరో లక్ష్యం ఏమిటి అనే దానిపై మాత్రమే క్లారిటీ ఇచ్చారు. విజువల్స్‌లో కూడా మంచి డెప్త్ కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటి వరకు ఎక్కువగా రొమాంటిక్ లేదా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌లలో కనిపించిన నాగ చైతన్య ఈసారి పూర్తిగా భిన్నమైన జానర్‌లో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన శారీరకంగా కూడా ఎంతో కష్టపడ్డారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఫిట్‌నెస్, లుక్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ఆయన ఈ సినిమాలో కొంచెం సన్నబడిన కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తుండగా, సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కథా రూపకల్పనలో సుకుమార్‌కి సంబంధించిన సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యం ఉంది.
ఈ సినిమాలో జయరాం, సత్య (కామెడియన్), జరీనా వహాబ్, శ్రీవాత్సవ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంటెన్స్ ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ‘వృషకర్మ’ సినిమాకు ఇంకా అధికారిక విడుదల తేదీ ప్రకటించలేదు. అయితే వేసవిలోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
సుమారు ఏడాది గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్ట్‌పై పనిచేసిన నాగ చైతన్యకు ‘వృషకర్మ’ పెద్ద బ్రేక్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు ఆయన తమ్ముడు అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ సినిమా కంటే ముందు ‘వృషకర్మ’ విడుదల అవుతుందా? లేదా తర్వాత వస్తుందా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram