ఎక్సరేలు.. స్కానింగ్ లు లేవు..ప్రాచీన శిల్పాల్లో గర్భస్థ శిశు ఆకృతులు!
ఎక్స్‌రేలు, స్కానింగ్ లేని వేల ఏళ్ల క్రితమే ఆలయ గోడలపై గర్భస్థ శిశువు ఆకృతులు చెక్కిన శిల్పాలు వైరల్. ప్రాచీన భారత వైద్య విజ్ఞానం గొప్పతనం మరోసారి చర్చలోకి వచ్చింది.
విధాత, హైదరాబాద్ : భారత దేశం ప్రాచీన నాగరికతకు..వైద్య విజ్ఞానికి నెలవుగా పురాణ, ఇతిహాసాలు, చరిత్రలోని అంశాలు నిదర్శనంగా కనిపిస్తుంటాయి. అలాగే ప్రాచీన దేవాలయాల నిర్మాణ ప్రత్యేకతలు, వాటి శిల్పాలు సైతం ఆనాటి నాగరికత, విజ్ఞానాన్ని చాటుతుంటాయి. వేల సంవత్సరాల నాటి ప్రాచీన ఆలయం గోడల శిల్పాలపై గర్బస్థ శిశువు శిల్పాలు చెక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది.
ఎలాంటి ఎక్సరేలు, స్కానింగ్ సాంకేతిత పరిజ్ఞానం అందుబాటులోని లేని వేల ఏళ్ల క్రితం పొత్తి కడుపును చూడకుండా.. ఎవరైనా తల్లి గర్భంలో ఉన్న శిశువును ఎలా చెక్కగలరన్న ప్రశ్న ఆసక్తి రేపుతుంది. ఎక్స్ రే కనిపెట్టడానికి 2000 సంవత్సరాల ముందే కేరళలోని త్రిశూల్ కుందడం వడక్కునాథ్ స్వామి ఆలయంలో గర్బస్థ శిశువు యొక్క వివిధ నెలల భంగిమల శిల్పాకృతులు ఆలయ గోడలపై ఉన్నాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఇదే మన ప్రాచీన నాగరికత, , విజ్ఞానం, శిల్ప కళా నైపుణ్యాల గొప్పతనం అంటున్నారు.
ప్రాచీన వైద్య శాస్త్ర ఘనులు వీరు..!
ప్రాచీన భారతదేశంలో వైద్యశాస్త్రం (ఆయుర్వేదం) అత్యున్నత స్థాయిలో ఉండేదట. క్రీ.పూ. 800లో చరకుడు తన చరక సంహితతో ఆయుర్వేద వైద్యం,ప్రకృతి సిద్దమైన ఔషధాలు, చికిత్స విధానాల విభిన్నసూత్రాల గురించి వివరించారు.
శుశ్రుతుడు తన సుశ్రుత సంహితలో శస్త్రచికిత్సకు సంబంధించిన 300 వేర్వేరు విధానాల వివరణలు, శస్త్రచికిత్సలలో ఉపయోగించే 120 వేర్వేరు పరికరాల గురించి గ్రంధస్థం చేశారు. మానవ శస్త్రచికిత్స ప్రక్రియ పుస్తకంలో 8 వేర్వేరు వర్గాలలో వివరించారు. ఆయనను ప్లాస్టిక్ సర్జరీ పితామహుడిగా, భారతీయ వైద్య పితామహుడిగా కూడా కూడా పిలుస్తారు.
అగస్త్య మహర్షి సిద్ధ వైద్య పితామహుడిగా బిరుదు పొందారు. పండ్లు, సుగంధ ద్రవ్యాలు, లోహాలు, అలాగే ఇతర ముఖ్యమైన భాగాల శక్తివంతమైన కలయికతో కూడిన సిద్ద వైద్య విధానాన్ని ఆయన వివరించారు.
2వ శతాబ్దానికి చెందిన పతంజలి అనే సాధువును యోగా పితామహుడు అని పిలుస్తారు. శారీరక దృఢత్వం, మనశ్శాంతి రెండింటిని సమన్వయంతో ఆరోగ్యం పొందడంపై ఆయన యోగాసాన విద్యను అందించారు. ఇక ఆచార్య నాగార్జునుడు ప్రాచీన కాలంలో ఔషధాల తయారీలో రసాయనశాస్త్రం, లోహాల వాడకం వినియోగంపై విజ్ఞానాన్ని అందించారు.
#పొత్తి కడుపును చూడకుండా ఎవరైనా తల్లి గర్భంలో ఉన్న శిశువును ఎలా చెక్కగలరు (ఎక్స్ రే కనిపెట్టడానికి 2000 సంవత్సరాల ముందే) ఈ ఆలయంలో శిశువు యొక్క వివిధ నెలల భంగిమలు ఆలయ గోడలపై ఉన్నాయి. ఇదే మన భారతీయుల గొప్పతనం.#కుందడం వడక్కునాథ్ స్వామి ఆలయం.(Kundadam Vadakkunath Swami Temple)🙏🏻
ఈ… pic.twitter.com/IO8iwqyMQB— Uppalapati Ramvarma (@Ramvarma2025) March 4, 2026
ఇవి కూడా చదవండి :
Vrushakarma | భయానక ఫాంటసీ ప్రపంచం ‘వృషకర్మ’… టీజర్‌లో కొత్త అవతారంలో కనిపించి ఆసక్తి పెంచిన చైతూ
Vem Narender Reddy | మిత్రుడికి రాజ్యసభ యోగం..రేవంత్ వ్యూహం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram