యువ‌త‌కు న్యూ ఇయ‌ర్ గిఫ్డ్‌గా కండోమ్స్‌.. ఎక్క‌డా..? ఎందుకోస‌మంటే..?

free condoms | యువ‌త కోసం ఫ్రెంచ్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచ‌లన బ‌హుమ‌తిని ప్ర‌క‌టించారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా దేశంలో ఉచితంగా కండోమ్స్‌ను అందిస్తామ‌ని చెప్పారు. 25 సంవ‌త్స‌రాల్లోపు యువ‌తీ యువ‌కులు కండోమ్స్‌ను ఉచితంగా అందించాల‌ని ఫార్మసీలను ఆదేశించారు. అయితే, విన‌డానికే కొంత వింత‌గా ఉన్నా ఇది నిజ‌మే. కండోమ్స్‌ను ఉచితంగా పంపిణీ చేయాల‌నే ఆదేశాల వెనుక ఓ ఉద్దేశం ఉన్న‌ది. అదేంటంటే.. ఫ్రాన్స్ యువ‌త ఎక్కువ‌గా లైంగిక కార్య‌క‌లాపాల్లో పాల్గొంటున్నారు. ఫ‌లితంగా అవాంఛిత గ‌ర్భ‌ధార‌ణ‌ల […]

యువ‌త‌కు న్యూ ఇయ‌ర్ గిఫ్డ్‌గా కండోమ్స్‌.. ఎక్క‌డా..? ఎందుకోస‌మంటే..?

free condoms | యువ‌త కోసం ఫ్రెంచ్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచ‌లన బ‌హుమ‌తిని ప్ర‌క‌టించారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా దేశంలో ఉచితంగా కండోమ్స్‌ను అందిస్తామ‌ని చెప్పారు. 25 సంవ‌త్స‌రాల్లోపు యువ‌తీ యువ‌కులు కండోమ్స్‌ను ఉచితంగా అందించాల‌ని ఫార్మసీలను ఆదేశించారు. అయితే, విన‌డానికే కొంత వింత‌గా ఉన్నా ఇది నిజ‌మే. కండోమ్స్‌ను ఉచితంగా పంపిణీ చేయాల‌నే ఆదేశాల వెనుక ఓ ఉద్దేశం ఉన్న‌ది. అదేంటంటే.. ఫ్రాన్స్ యువ‌త ఎక్కువ‌గా లైంగిక కార్య‌క‌లాపాల్లో పాల్గొంటున్నారు. ఫ‌లితంగా అవాంఛిత గ‌ర్భ‌ధార‌ణ‌ల సంఖ్య విప‌రీతంగా పెరుగుతున్న‌ది. దాంతో నియంత్ర‌ణ కోసం ఆప‌రేష‌న్లు చేయించుకుంటున్నారు. ఈ అవాంఛిత గ‌ర్భాల‌ను త‌గ్గించేందుకు ఉచితంగా కండోమ్స్‌ను ఉచితంగా అంద‌జేయాల‌ని ఆదేశించారు.

30శాతం పెరిగిన లైంగిక వ్యాధుల రేటు..

2020-21 మ‌ధ్య ఫ్రాన్స్‌లో లైంగిక వ్యాధుల సంక్ర‌మ‌ణ రేటు 30శాతం పెరిగాయ‌ని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి 18- 25 సంవత్సరాల మధ్య ఉన్న గర్భనిరోధక మాత్రలు, గర్భసంచి లోపలే గర్భనిరోధక లూప్ (IUD)లు, గర్భనిరోధక ప్యాచ్‌లు, ఇతర దీర్ఘకాలిక గర్భనిరోధకాలు ఉచితంగా అందిస్తూ వ‌స్తున్న‌ది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా యువ‌తులు గర్భనిరోధకాన్ని వదులుకోకుండా కార్యక్రమాన్ని ప్ర‌భుత్వం విస్త‌రించింద‌ని స్థానిక మీడియా పేర్కొంది. ఎయిడ్స్ వంటి లైంగిక వ్యాధుల‌ను ఎదుర్కొనేందుకు వైద్యుల సూచ‌న మేర‌కు కండోమ్స్ విక్ర‌యాలు చేప‌డుతున్న‌ట్లు జాతీయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ పేర్కొంది. ఇదిలా ఉండ‌గా.. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిని ఆదేశాలు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి అమ‌లులోకి రానుంది. ఈ నిర్ణ‌యంతో యువ‌త ఆరోగ్య‌క‌ర‌మైన లైంగిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటార‌ని, అవాంఛిత గ‌ర్భ‌ధార‌ణ‌, లైంగిక వ్యాధుల వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయొచ్చ‌ని వైద్య నిపుణులు భావిస్తున్నారు.