Telangana municipal elections 2026| మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ దే ఆధిపత్యం

మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సింహభాగం మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకుంది.

Telangana municipal elections 2026| మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ దే ఆధిపత్యం

విధాత, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సింహభాగం మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకుంది. ఏడు కార్పోరేషన్లలో కాంగ్రెస్ పార్టీకి 4, బీజేపీకి 2 చోట్ల అధిక్యత దక్కింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. మంచిర్యాలలో 60 వార్డులకు గానూ కాంగ్రెస్‌ 41, బీఆర్‌ఎస్‌ 8, బీజేపీ 4, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. రామగుండంలో 60కి గానూ కాంగ్రెస్‌ 35, బీఆర్‌ఎస్‌ 13, బీజేపీ 1, ఇతరులు 4 స్థానాల్లో, నల్గొండలో 48కి గానూ కాంగ్రెస్‌ 27, బీఆర్‌ఎస్‌ 9, బీజేపీ 4, ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు. మహాబూబ్ నగర్ లో కూడా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధించింది. కొత్త గూడెంలో హంగ్ ఏర్పడినప్పటికి సీపీఐ 24, కాంగ్రెస్ 22స్థానాలు గెలుచుకోగా, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ల మద్దతు కీలకంగా మారింది. నిజమాబాద్ లో, కరీంనగర్ కార్పోరోషన్లలో బీజేపీకి ఆధిక్యత దక్కింది.

116 మున్సిపాల్టీలలో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 14 మున్సిపాల్టీలను కైవసం చేసుకున్నాయి. 26చోట్ల హంగ్ ఏర్పడింది. ఒక చోట వడ్డెపల్లిలో జాగృతి బలపరిచిన ఫార్వర్డ్ బ్లాక్ పాగా వేసింది. కొత్తగూడెం కార్పోరేషన్ తో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాల్టీల్లో క్యాంపు రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. హంగ్ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో మెజార్టీ మున్సిపాల్టీలు దక్కించుకోవాలని పావులు కదుపుతుంది. ఈ నెల 16న జరిగే మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైస్ పర్సన్ ల ఎన్నికల వరకు గెలిచిన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు చేజారిపోకుండా అన్ని పార్టీలు కూడా గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించాయి.