Allu Sirish | అల్లూ వారింట హల్దీ వేడుక.. సందడి చేసిన మెగా ఫ్యామిలీ
Allu Sirish | అల్లు కుటుంబంలో పెళ్లి శుభకార్యాల సందడి మొదలైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.
Allu Sirish | అల్లు కుటుంబంలో పెళ్లి శుభకార్యాల సందడి మొదలైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటివరకు బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ వచ్చిన శిరీష్, ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన ఆయన పెళ్లి వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
శిరీష్ తన చిరకాల స్నేహితురాలు నయనికను వివాహం చేసుకోనున్నారు. గతేడాది అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఇప్పుడు వివాహ ముహూర్తాన్ని మార్చి 6గా నిర్ణయించారు. ఇదే రోజు అల్లు అర్జున్–స్నేహారెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం కూడా కావడం విశేషం. అన్నయ్య పెళ్లి రోజు తమ్ముడు పెళ్లి జరగడం అల్లు కుటుంబానికి మరపురాని క్షణంగా నిలిచిపోనుందని అభిమానులు భావిస్తున్నారు.
పెళ్లి వేడుక సమయం దగ్గరపడుతుండటంతో ఇప్పటికే ప్రీ–వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల దుబాయ్‌లో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య ప్రత్యేక వేడుకలు నిర్వహించగా, తాజాగా హైదరాబాద్‌లోని అల్లు అరవింద్ నివాసంలో సంప్రదాయబద్ధంగా ‘పసుపు దంచుడు’ కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించారు. సాధారణంగా హల్దీ వేడుకలను గ్రాండ్‌గా నిర్వహించే నేపథ్యంలో, ఇంటి వాతావరణంలో సింపుల్‌గా జరపడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను అల్లు శిరీష్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వెంటనే వైరల్ అయింది.
ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, ఉపాసన, సుస్మిత, అన్నాలెజినోవా ఇతర బంధువులు, చిన్నారులు పాల్గొని వేడుకకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. ఇంట్లోనే సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమం అల్లు కుటుంబంలో పెళ్లి హడావుడిని స్పష్టంగా చూపించింది.
ఇక వధువు నయనిక విషయానికొస్తే, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందిన ఆమెతో శిరీష్‌కు చాలా కాలంగా పరిచయం ఉందని తెలుస్తోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో ఇప్పుడు ఈ బంధం వివాహంగా మారబోతోంది. అల్లు వారింట శుభకార్యాలు మొదలుకావడంతో మెగా అభిమానులు, సినీ వర్గాలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
The joyous wedding celebrations of#AlluSirish kick off with a vibrant #Pasupu ceremony hosted by the family. pic.twitter.com/zUIWq1ediX
— Hyderabad Times (@HydTimes) February 13, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram